ముషీరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె!   | Bandaru Dattatreya Daughter Vijayalakshmi Exclusive Full Interview | Sakshi
Sakshi News home page

ముషీరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బరిలో దత్తాత్రేయ కుమార్తె! ఆమె స్పందన ఇదే..

Sep 4 2023 8:33 AM | Updated on Sep 4 2023 8:38 AM

Bandaru Dattatreya Daughter Vijayalakshmi Exclusive Full Interview - Sakshi

హైదరాబాద్: ముషీరాబాద్‌ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్‌ కేటాయింపుపై మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై సాక్షి ప్రతినిధి ఆమెతో ముచ్చటించారు.  

 పాలిటిక్స్‌ అంటే మీకు ఇంట్రెస్ట్‌ ఉందా? 
 సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలు కూడా చాలా ఇష్టం. అందుకే అనేక సంవత్సరాలుగా పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొంటున్నాను.  



నాన్న అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారా? 
జవాబు: నాన్న చిన్నప్పటి నుంచి నేరి్పన నీతి, నైతిక విలువలు, క్రమ శిక్షణతో పాటు ఆయన కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చాను. 2014, 2019, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటూ.. వస్తున్నాను. మా నాన్న సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నుంచి గత 35–40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండటంతో ప్రతి కార్యకర్త, నాయకులతో పరిచయాలు ఉన్నాయి. మా ఇళ్లు, పార్టీ వేర్వేరు అని ఏనాడు అనుకోవడం లేదు. దీనికి తోడు అత్తగారి కుటుంబం కూడా రాజకీయాలతో ముడిపడిన కుటుంబమే. మా మామయ్య చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు.  

ముషీరాబాద్‌ టికెట్‌ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? 
లేదు. మొదట పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలి. నేను ఎక్కడైనా సరిపోతానని పార్టీ అనుకుంటే పార్టీ అక్కడ నిలపెడుతుంది. నా వరకు నేను ఇప్పటి వరకు ప్రత్యక్షంగా అడిగింది లేదు. నేను అక్కడ నిలుచుంటానని చెప్పడం మేము నేర్చుకున్న సిద్ధాంతం కాదు. అలా అడగడం మా పార్టీలైన్‌ కాదు.  

ప్రజలు కోరుకుంటున్నారు కదా.? 
ప్రజలు ఖచ్ఛితంగా బీఆర్‌ఎస్‌ నుంచి వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విజయలక్ష్మిని కోరుకుంటున్నారని నేను అనుకోను. బీజేపీ అభ్యర్థిగా విజయలక్ష్మి సరిపోతుందని పార్టీ అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా.. !  

డాక్టర్‌ లక్ష్మణ్‌ తరువాత మీపేరే ఎక్కువగా వినిపిస్తుంది?  
అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనే లైన్‌లో పనిచేసింది లేదు. బీజేపీ కార్యకర్తగానే గుర్తించబడటం నాకు ఇష్టం.  

ఒక వేళ అవకాశం కల్పిస్తే
అవకాశం కల్పిస్తే.. పూర్తి బాధ్యతాయుతంగా పార్టీకోసం పనిచేస్తాను.  

ఎన్నికలు దగ్గరపడుతున్నాయి, తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిదేమో? 
మనం ఒక నిర్ణయానికి రావొద్దు, పార్టీ అధిష్టానం రావాలి. వేరే పారీ్టలాగ నేను ఇక్కడ నిల్చుంటేనే ఉంటా అనే పార్టీ బీజేపీ కాదు. బీజేపీకి క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ ఉంటుంది.  పనిచేస్తూ.. పోవాలంతే.. ఫలితం ఆశించకూడదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement