Bail for accused in Kamalapur SSC paper leak case - Sakshi
Sakshi News home page

కమలాపూర్‌ టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో నిందితులకు బెయిల్‌.. పోలీస్‌ కస్టడీ పిటిషన్‌ డిస్మిస్‌

Apr 11 2023 3:57 PM | Updated on Apr 11 2023 5:13 PM

Bail for accused in Kamalapur SSC paper leak case - Sakshi

పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.. 

సాక్షి, వరంగల్: కమలాపూర్‌లో టెన్త్ పేపర్ లీక్ వ్యవహరానికి సంబంధించిన కేసులో.. నిందితులకు కోర్టు ఊరట లభించింది. ముగ్గురికి మంగళవారం బెయిల్ మంజూరు చేసింది స్థానిక కోర్టు. ఈ కేసులో ఏ2గా ఉన్న ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ5 శివగణేష్ కు బెయిల్ ఇచ్చింది కోర్టు. అలాగే.. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు మెజిస్ట్రేట్.

ఇదిలా ఉంటే.. పోలీస్ కస్టడీ పిటిషన్, బెయిల్ పిటిషన్‌లపై నిన్న(సోమవారం) సైతం వాదనలు జరిగాయి. కస్టడీ పిటిషన్ వేసిన దృష్ట్యా బెయిల్ ఇవ్వద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బెయిల్ లభించడంతో.. మిగతా నిందితులకూ బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరపున న్యాయవాదులు కోరారు. వాదోపవాదనల అనంతరం తీర్పును ఈరోజు(మంగళవారం) వాయిదా వేసిన మెజిస్ట్రేట్. చివరకు.. బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌ కేసులో కీలక దశకు సిట్‌ విచారణ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement