అవే నన్ను కుంగదీస్తున్నాయి.. వారసత్వానికి దూరం చేసే యత్నం
బాల్యంలో ప్యాలెస్‌లలో గడిపాను.. నేడు హోటల్‌లో ఉండాల్సిన దుస్థితి
నిజాం వస్తువులను అక్రమంగా తరలించుకుపోతుంటే బాధ వేస్తోంది
‘సాక్షి’తో ఎనిమిదో నిజాం ముకరం జా కుమారుడు ఆజం జా
గౌరీభట్ల నరసింహమూర్తి
‘నా బాల్యం ఈ చారిత్రక నగరంలోనే సాగింది. హైదరాబాద్ రోడ్లపై విహరించాను, ఇక్కడి చెరువులను చూ శాను, నాటి ఉద్యానవనాల్లో తిరిగాను, మైదానాల్లో ఆట లాడాను. ఇక్కడి ప్రజల జీవనగమనాన్ని పరిశీలించాను. ఈ నగరానికి, ఇక్కడి ప్ర జలకు, ముఖ్యంగా పేదలకు ఏదో చే యాలన్న తపన ఉంది. వేగంగా పురోగమిస్తున్న పది ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి అన్న విషయం చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ, నిజాం వా రసుడిగా నాకు దక్కాల్సిన స్థానాన్ని కూ లదోసేందుకు, ఆ ఆస్తుల్లో నాకు వాటా రాకుండా చేసేందుకు జరుగుతున్న కుట్రలు నన్ను కుంగదీస్తున్నాయి. నేను ఆస్ట్రేలియాలో ఉన్నా హైదరాబాదీనే’... ఇవీ ఎనిమిదో నిజాం ముకరం జా తనయుడు అలెగ్జాండర్ ఆ జం జా చెబుతున్న ఆసక్తికర అంశాలు. నిజాం ఆస్తులపై సవతి తల్లి కుటుంబ సభ్యు లతో ఉన్న వ్యాజ్యాల కోసం నగరానికి వచ్చిన ఆజం జా గురువారం ‘సాక్షి’తో ప్రత్యే కంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
హైదరాబాద్‌ను రెండు శతాబ్దాల పాటు పాలించి న అసఫ్ జాహీ వారసుడిని నేను. ఎనిమిదో నిజాంగా స్వయంగా ప్రభుత్వం గుర్తించిన ముకరం జా కుమారుడిని. వాస్తవానికి నేను ఆయన వారసుడిని. కానీ, ఆయన మాజీ భార్య, ఆమె పిల్లలు న న్ను ఆ వారసత్వానికి దూరం చేసే కు ట్రలు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్‌లో నిజాం ఆస్తులు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్యాలెస్‌లు ఆయన సొంతం. భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీ నం సమయంలో అధికారికంగా సంక్ర మించిన ఆస్తులున్నాయి. మా నాన్న హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ముకరం జా ట్రస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్‌లో నన్ను సభ్యుడిగా నియమించారు.
దాని ద్వారా పేదలకు చవకగా చదువు చెప్పించాలన్నది ఆయన తాపత్రయం. ఆ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేనూ నిర్ణయించుకున్నా. కానీ, ముకరం జా వారసులుగా చెప్పుకునేవాళ్లు అందులో ఎన్నో అవకతవకలకు తెరలేపారు. నేను అందులో ఉంటే వారి కుట్రలు సాగవని తేలుసుకుని అందులోనుంచి నన్ను తొలగించారు. నా బాల్యంలో హైద రాబాద్‌లోని చిరాన్, చౌమహల్లా, ఫలక్‌నుమా ప్యాలెస్‌లలో గడిపిన వాడిని. కానీ, ఇప్పుడు అన్ని ప్యాలెస్‌లు ఉండి కూడా, హైదరాబాద్‌కు వస్తే హోటల్ గదిలో ఉండాల్సిన దుస్థితి కల్పించారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకంతో ఉన్నాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.
నాకు న్యాయమైన వాటా అందాల్సి ఉంది
ముస్లిం పర్సనల్ లా, ఇస్లామిక్ షరియా ప్రకారం ... ఆస్తులను ఆరు భాగాలు చేసి అందులో ఓ భాగం నాకు దక్కాల్సి ఉంది. భారత న్యాయ సూత్రాల ప్రకారం చూసినా నా వాటా నాకు దక్కాల్సిందే. దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఉండే ఆస్తుల విలువలో నాకు న్యాయమైన వాటా అందాల్సి ఉంది. కానీ, అది అందకుండా నన్ను ఆవేదనకు గురిచేస్తున్నారు. ప్యాలెస్‌లలో ఉన్న విలువైన నిజాం వస్తువులను అక్రమంగా తరలించుకుపోతుంటే బాధగా ఉంది. తరలిన వస్తువులు నిజాంవేనని ధ్రువపరిచే ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నా తండ్రి నుంచి విడాకులు పొందిన మహిళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నా తండ్రి బతికున్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టిన వారు, ఇప్పుడు ఆయన ఆస్తికి వారసులుగా అక్రమాలకు తెర దీశారు.
హుస్సేన్ గుర్తుకొస్తారు..
చిరాన్ ప్యాలెస్, కింగ్ కోఠి ప్యాలెస్‌లలో నా బాల్యం సంతోషంగా గడిచింది. ఈ సమయంలో నా కేర్‌టేకర్‌గా మా నాన్న హుస్సేన్ అనే వ్యక్తిని ఏర్పాటు చేశారు. నన్ను సైకిల్‌పై తిప్పడం, వీధుల్లో విహారానికి తీసుకెళ్లడం, నేను సంతోషంగా ఉండేలా చేయడం... ఇలా ఆయన చేసిన సేవలు అపారం. ఇప్పు డు హైదరాబాద్ వీధుల్లో తిరుగుతుంటే ఆనాడు హుస్సేన్‌తో గడిపిన రోజులు గుర్తొచ్చి మనసు భారంగా మారుతోంది.


