breaking news
Gauri bhatla Narasimha murthy
-
ఖ్వాబ్.. కబాబ్
షహర్‌కీ షాన్ ‘ఆహా... ఈ పదార్థం రుచి చూస్తుంటే స్వర్గంలో విహరించినట్టుంది. ఇలాంటి రుచి కమ్మని కలగా ఉండేది. కానీ అలాంటి రుచి ఒకటి నిజంగానే ఉందని దీన్ని తిన్నాకే తెలిసింది’ 1603 ప్రాంతంలో గోల్కొండ రాజ్యానికి వచ్చిన పర్షియూ రాయబారి అన్న మాటలివి. ఆయనను మరీ అంత ప్రత్యేకంగా ఆకట్టుకున్న పదార్థమే కబాబ్. విచిత్రమేంటంటే... కబాబ్ పుట్టినిల్లు పర్షియా. అదే హైదరాబాదీ కబాబ్ ప్రత్యేకత. కబాబ్ పర్షియాలో పుట్టినా... గొప్ప రుచినద్దింది మాత్రం మనమే! లక్నోలో కబాబ్ రకాలెక్కువ... భాగ్యనగరంలో రుచెక్కువ! అందుకే ఇండియాలో టాప్ హైదరాబాదీ కబాబే. కబాబ్ మన దేశంలోకి వచ్చి ఈ ఏడాదితో 500 ఏళ్లు! గౌరీభట్ల నరసింహమూర్తి కబాబ్... భోజనప్రియుల నోట్లో నీరూరించేది. ప్రపంచవ్యాప్తంగా కబాబ్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మన దేశమే. నిజానికి కబాబ్‌లకు ప్రత్యేక నగరం లక్నో. అక్కడ దొరికినన్ని వెరైటీ కబాబ్‌లు మరెక్కడా కనిపించవు. అయినా... లక్నోను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది హైదరాబాదీ కబాబ్. ముర్గీ మలై కబాబ్, జల్పరీ కబాబ్, దుదియూ కబాబ్, రామ్‌పురీ కబాబ్లాంటి లక్నో రుచులకోసం ఆవురావురనే వారు కూడా హైదరాబాదీ స్పెషల్స్ అయిన బోటి కబాబ్, షీక్ కబాబ్, లగాన్ కే కబాబ్, దమ్ కి కబాబ్, తంగ్డీ కబాబ్ వైపే మొగ్గు చూపుతారు. అసలైన హైదరాబాదీ కబాబ్ రుచి చూడాలంటే పురాతన హోటళ్లకు వెళ్లాల్సిందే. సుల్తాన్ల కాలంలో... కబాబ్‌లకు పుట్టినిల్లు పర్షియూ. కబాబ్ అన్న పేరు కమాబ్ అనే పర్షియూ పదం నుంచి పుట్టింది. కమ్ అంటే తక్కువ, ఆబ్ అంటే నీరు... తక్కువ నీటితో వండే పదార్థంగా పేర్కొన్నందున దీనికా పేరొచ్చిందని అంటారు. అలాగే వేయించటమే అర్ధంలో కూడా దానికా పేరొచ్చిందని మరో కథనం. 1515... అంటే ఢిల్లీ సుల్తానుల కాలంలోనే కబాబ్ రుచి మన దేశానికి పరిచయమైందని విశ్లేషకులు చెబుతున్నారు. అరుుతే ప్రారంభదశలో కబాబ్ రుచికి మొఘల్ సామ్రాజ్యం మధ్యకాలంలో రుచికి ఎంతో తేడా ఉంది. ఈ వంటకానికి మొఘలుల కాలంలో బావర్జీలు ఎన్నో వన్నెలద్దారు. నవాబుల కాలంలో కబాబుల హవా... జహంగీర్, షాజాహాన్ల జమానాను వంటల స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. వారి కాలంలోనే కబాబ్కు విశిష్ట స్థానం దక్కితే, ఔరంగజేబు కాలంలో ఈ వంటకానికి హైదరాబాద్ చిరునామాగా మారింది. ఆ వెంటనే మొదలైన కుతుబ్‌షాహీలు కబాబ్‌లను నగర షాహీదస్తర్ఖానాల్లో తలమానికంగా మార్చేశారు. అసఫ్జాహీలు దీన్ని కొత్త రుచులతో ప్రపంచానికి పరిచయం చేశారు. అందుకే నవాబుల జమానా అంతరించినా కబాబుల హవా కొనసాగుతూనే ఉంది. దాదాపు 200 రకాల నాన్‌వెజ్, వెజిటేరియన్ రకాలనూ వడ్డిస్తున్నారంటే భోజనప్రియుల్లో దీనికి ఉన్న క్రేజ్ అవగతమవుతుంది. వీరి జిహ్వచాపల్యాన్ని గుర్తించిన రెస్టారెంట్లు ప్రత్యేకంగా కబాబ్ ఫెస్టివల్స్‌ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కబాబ్‌లు దొరుకుతున్నా స్పైసీ కబాబ్‌లలో మాత్రం కింగ్ హైదరాబాదీ వెరైటీలే! -
పరమత సహనం.. బోనం
సంప్రదాయం: ‘‘అమ్మా బెలైల్లినాదో నాయనా... తల్లీ బెలైల్లినాదో నాయనా...’’ ఆషాఢమాసం ఆదివారం భాగ్యనగర లోగిళ్లలో మార్మోగే జనపదం ఇది. ఆషాఢం అంటేనే ఈ మహానగరికి పూనకం వస్తుంది. బోనాలంటే భక్తి భావంతో పొంగి పోవడమే కాదు.. సమష్టి తత్వానికి.. పరమత సహనానికి ప్రతీక. 1908, సెప్టెంబర్ 28 తెల్లవారుజాము 2 గంటలు.. ప్రశాంతంగా సాగిపోతున్న మూసీ నది.. ఉగ్రరూపం దాల్చిన వేళ. మరో నాలుగు గంటలయ్యే సరికి ప్రళయాన్ని తలపించింది. 60 అడుగుల మేర ఉవ్వెత్తున పొంగిన మూసీ.. నగరంపై జల ఖడ్గం ఝళిపించింది. అఫ్జల్‌గంజ్, ముస్లింజంగ్, ఛాదర్‌ఘాట్ వంతెనలు ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. 15 వేల మంది ప్రాణాలను హరించింది. పరీవాహక ప్రాంతంలోని 80 వేల ఇళ్లను ముంచెత్తింది. చార్మినార్ కట్టడంలో భాగంగా ఉన్న భాగ్యలక్ష్మీ దేవిని పూజిస్తే మూసీ శాంతిస్తుందన్న మాట ఆరో నిజాం చెవిన పడింది. వెంటనే ఆయన అమ్మవారికి రాజప్రాసాదం నుంచి చీర-సారె పంపి ప్రత్యేక పూజలు జరిపించారు. ఆనాటి నుంచి ప్రతిసారీ బోనాల వేడుకకు ఆ అమ్మవారికి చీర-సారె పంపడం ఆనవాయితీగా మారింది. తర్వాతి కాలంలో రజాకార్లు అరాచకం సృష్టించిన రోజుల్లోనూ.., బోనాల వేడుక మత సామరస్యానికి ఆదర్శంగా నిలిచింది. నగర జీవనంతో పెనవేసుకున్న ఈ జనోత్సవానికి నిజాం ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించింది. ప్రతి ఆషాఢం తొలి ఆదివారం గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారికి, రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో, మూడో వారం పాతబస్తీలోని మూసీ ఈవల ప్రాంతం, నాలుగో ఆదివారం మూసీ అవతలి పాతబస్తీలో బోనాలు సమర్పిస్తూ వస్తున్నారు. ఆ ఏనుగే సాక్ష్యం : బోనాల వేడుక పరమత సహనానికి ప్రతీక. నిజాం కాలం నుంచి నేటి వరకు ఈ జన జాతరలో అపశ్రుతులు దొర్లిన సందర్భాలు లేవు. పాతబస్తీలో అమ్మవారి ఘటాలతో నిర్వహించే ఊరేగింపులో పాల్గొన్న వారికి దాహం కోసం ముస్లిం సోదరులు మంచి నీటిని అందించేవారు. నేటికీ చాలా మంది ముస్లింలు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. బోనాల వేడుకల్లో అక్కన్నమాదన్న దేవాలయం దగ్గర, లష్కర్ ఉజ్జయినీ మహంకాళి ఆలయం దగ్గర సామూహిక ఊరేగింపులో ఏనుగు పాల్గొనటం ఆనవాయితీ. పదిహేనేళ్ల కిందట.. ఏటా ఉత్సవంలో పాల్గొనే ఏనుగును జాతరలో వినియోగించే పరిస్థితి కనిపించలేదు. అనాదిగా వస్తున్న ఆచారం పడిపోతుందని నిర్వాహకులు బాధపడుతున్న సమయంలో.. నిజాం ట్రస్టు నిర్వాహకులు హష్మీ అని పిలుచుకునే తమ ఏనుగును జాతరకు పంపారు. అప్పటి వరకు బీబీకాఆలం ఊరేగింపులో మాత్రమే పాల్గొన్న ఆ ఏనుగు.. అమ్మవారి సేవలో పాల్గొంది. మతాలు వేరైనా భక్తి భావం ఒక్కటే అని చాటిన ఈ సంఘటన మతసామరస్యానికి నిదర్శనం. - గౌరీభట్ల నరసింహమూర్తి