నేడు సీఎంతో అసదుద్దీన్‌ భేటీ 

Asaduddin Met With CM KCR Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. కొత్త సచివాల యం నిర్మాణం కోసం పాత సచివాలయ భవనాలను కూల్చినప్పుడు అక్కడి రెండు మసీదులను సైతం కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మసీదుల పునర్నిర్మాణం విషయం చర్చించేందుకు ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, ఇతర ముస్లిం సంస్థల ప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తున్నట్టు అసదుద్దీన్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top