భార్య టార్చర్‌ను భరించలేకపోతున్నా ఫ్రెండ్స్‌.. ఆర్మీ జవాన్‌ | Army Jawan Attempts To Ends Her Life In Bhupalpally | Sakshi
Sakshi News home page

భార్య టార్చర్‌ను భరించలేకపోతున్నా ఫ్రెండ్స్‌.. ఆర్మీ జవాన్‌

Jun 10 2025 12:52 PM | Updated on Jun 10 2025 1:31 PM

 Army Jawan Attempts To Ends Her Life In Bhupalpally

శాయంపేట(జయశంకర్): భార్య వేధింపులు తట్టుకోలేక ఓ ఆర్మీ జవాన్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబీకుల కథనం వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్‌ సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని టెరిటోరియల్‌ ఆర్మీ 125 బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో 2020లో వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ గొడువలు జరుగుతున్నాయి. 

భార్యతోపాటు అత్తింటి వారు కూడా ప్రవీణ్‌ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రవీణ్‌ ఉద్యోగానికి వెళ్లకుండా ఐడీ కార్డు దాచిపెట్టి వేధించారు. ఈక్రమంలో ప్రవీణ్‌ రెండు నెలల క్రితం విధులకు వెళ్లగా తన భార్య బెటాలియన్‌ వద్దకు వెళ్లింది. అక్కడ గొడవ చేసి ప్రవీణ్‌ పరువు తీయడంతో మనస్తాపం చెందాడు. దీంతో సెలవుల నిమిత్తం ప్రవీణ్‌.. ఈ నెల 6న ఇంటికొచ్చి కుటుంబీకులతో మాట్లాడి హనుమకొండకు వెళ్లాడు. 8న హనుమకొండలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి తన అన్న ప్రసాద్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో వెంటనే ప్రవీణ్‌ను తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు.

 ప్రస్తుతం ప్రవీణ్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రవీణ్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. అందులో ‘డియర్‌ ఫ్రెండ్స్‌ నేను చనిపోతున్నా.. నా చావుకి కారణమెవరో వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్‌ తట్టుకోలేకపోతున్నా. అన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో. మన గ్రామంలో వాలీబాల్‌ టీమ్‌ బతకాలి, ఎప్పుడూ గేమ్‌ను వదలొద్దు’ అని  పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement