ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి మోసం | Army Employee Cheated Young Woman With The Name Of Love In Telangana - Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి మోసం

Published Tue, Nov 21 2023 1:05 PM

Army employee cheating on woman - Sakshi

డోన్‌ టౌన్‌: ప్రేమ పేరుతో ఆర్మీ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టింది. బాధితురాలు చిన్నమల్కాపురం గ్రామానికి చెందిన శిరీష మాట్లాడుతూ తమ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ ప్రవీణ్‌ ఆరేళ్ల క్రితం ప్రేమ పేరుతో తన వెంట పడ్డాడన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడన్నారు.

ఇప్పుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్నాడని ఆరోపించారు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. కాగా యువతికి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు నిర్మలమ్మ, ఉపాధ్యక్షురాలు షమీమ్‌బేగం గ్రామ మహిళలు మద్దతు తెలిపారు.

 
Advertisement
 
Advertisement