
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన 'సుందరకాండ' థియేటర్లో విజయవంతంగా రన్ అవుతుంది. సినిమాకు మంచి టాక్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మూవీ చూసేందుకు ఆసక్తిచూపుతున్నారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా రోహిత్ తాజాగా గుంటూరుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే తన పెళ్లి ఎప్పుడు అనేది అభిమానులతో పంచుకున్నారు.
భైరవం, సుందరకాండ వరుస సినిమాలతో నారా రోహిత్ మళ్లీ బిజీ అయ్యారు. ఇదే సమయంలో తాను ప్రేమించిన శిరీషతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో వారిద్దరి నిశ్చితార్థం జరిగింది. త్వరలో పెళ్లి ఉంటుందనుకున్న సమయంలో ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) మరణించడంతో శుభకార్యానికి బ్రేకులు పడ్డాయి. అయితే, తాజాగా నారా రోహిత్ గుంటూరులోని గణనాథుడిని దర్శించుకున్న తర్వాత తన పెళ్లి గురించి రివీల్ చేశారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో తమ వివాహం జరగనుందని మీడియాతో తెలిపారు.
'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు.