లాక్‌డౌన్‌ కఠినతరం: సరిహద్దు వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌

AP Telangana Border: Heavy Traffic At Ramapuram Check Post Due To Lockdown - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. లాక్‌డౌన్‌ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివస్తున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా వాహనాలను నిలిపివేస్తున్నాki. ఈ-పాస్‌ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరిన అని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతోరా.9 నుంచి ఉ. 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 తర్వాత గూడ్స్‌ వాహనాలకు అనుమతి నిరారించింది. అయితే జొమాటో, స్విగ్గిలాంటి ఆన్‌లైన్‌ డెలివరీకి అనుమతి ఉంది.

చదవండి: లాక్‌డౌన్‌.. లాఠీలకు పని చెబుతున్న పోలీసులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top