breaking news
Ramapuram check post
-
రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని తెలంగాణ సరిహద్దు రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెలంగాణ పోలీసులు ఈ-పాస్ లేని వాహనాలను అనుమతించటంలేదు. ఏపీ నుంచి వస్తున్న ఈ-పాస్ లేని వాహనాలను అడ్డుకుంటున్నారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. -
ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తుండటంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ సరిహద్దు వద్ద మరోసారి గందరగోళ వాతావరణం నెలకొంది. లాక్డౌన్ సడలింపు ఉంటుందన్న భావనతో ఏపీ నుంచి భారీగా వాహనదారులు తరలివస్తున్నారు. దీంతో చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అంతర్రాష్ట్ర సరిహద్దులైన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఉన్నా వాహనాలను నిలిపివేస్తున్నాki. ఈ-పాస్ ఉంటేనే అనుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ వాహనాలకు గుర్తింపు కార్డులు తప్పనిసరిన అని పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలు మరింత కఠినతరం చేయడంతోరా.9 నుంచి ఉ. 8 గంటల వరకు మాత్రమే సరుకు రవాణాకు అనుమతి ఇచ్చింది. ఉదయం 10 తర్వాత గూడ్స్ వాహనాలకు అనుమతి నిరారించింది. అయితే జొమాటో, స్విగ్గిలాంటి ఆన్లైన్ డెలివరీకి అనుమతి ఉంది. చదవండి: లాక్డౌన్.. లాఠీలకు పని చెబుతున్న పోలీసులు -
రూ. 75లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
కడప: రాజంపేట మండలం గుండ్లూరు రామాపురం చెక్‌పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ. 75 లక్షల విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బొప్పాయిని తరలిస్తున్న టెంపోలో ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. అనంతరం ఇద్దరు స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించగా పరారైనట్టు పోలీసులు తెలిపారు.