ప్రజల ప్రాణాలతో టీఆర్‌ఎస్, బీజేపీ చెలగాటం  | Alleti Maheshwar Reddy criticized On TRS AND BJP Party | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో టీఆర్‌ఎస్, బీజేపీ చెలగాటం 

Jan 9 2022 4:47 AM | Updated on Jan 9 2022 4:47 AM

Alleti Maheshwar Reddy criticized On TRS AND BJP Party - Sakshi

ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్, బీజేపీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధర్నాలు, రైతుబంధు సంబురా ల పేరుతో టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజల పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీల కార్యక్రమాలపై ఆంక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా ఏఐసీసీ ఆదేశాల మేరకు తమ పార్టీ శిక్షణా కార్యక్రమాలను వాయిదా వేస్తున్నామని, నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement