చీఫ్‌ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు | ACB raids Chief Engineer house | Sakshi
Sakshi News home page

చీఫ్‌ ఇంజనీర్ ఇంట్లో.. నోట్ల కుప్పలు, బంగారు బిస్కెట్లు

Jun 9 2026 3:20 PM | Updated on Jun 9 2026 3:38 PM

ACB raids Chief Engineer house

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగళం బయిటపడింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ జే. బాలు  నివాసంలో ఈ రోజు ( మంగళవారం)  తెల్లవారుజామున ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మాదాపూర్ లోని నివాసంతో సహా ఏకకాలంలో పదకొండు చోట్ల అనినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కాగా అధికారుల తనిఖీల్లో ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బుల కట్టలు.. బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, విదేశీ మద్యం సీసాలు దొరికాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు. ఇంకా ఆయనకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయా అనే విషయంపై దర్యాప్తు చేపడుతున్నారు. 

కాగా మోహన్ నాయక్ పై గతం నుంచే పెద్దఎ‍త్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రతీ రోడ్డు కాంట్రాక్ట్ ఇతర నిర్మాణాలకు సంబంధించి పెద్ద మొత్తంలో కాంట్రాక్టర్ల నుండి కమిషన్ వసూల్ చేస్తున్నట్లు పలు మార్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ దాడులు చేపట్టగా పెద్ద మెుత్తంలో ఆస్తులు బయిటపడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement