సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌ అయిన బాలుడు సేఫ్‌ | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌ అయిన బాలుడు సేఫ్‌

Published Sat, Sep 30 2023 10:14 AM

5 Year Old Boy Kidnapped At Secunderabad Railway Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌ అయిన బాలుడిని పోలీసులు రక్షించారు. మాదాపూర్‌ బ్రిడ్జి కింద బాలుడిని గుర్తించారు. బ్రిడ్జి కింద చిన్నారిని పడుకోబెట్టి బిక్షాటన చేసిన కిడ్నాపర్‌.. పోలీసులను చూసి పొదల్లోకి వదిలి పారిపోయాడు. ఆరు గంటలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించి బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బెగ్గింగ్‌ కోసమే కిడ్నాపన్‌ చేసినట్లు తేలింది.

అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో యిదేళ్ల బాలుడు కిడ్నప్‌కు గురైన విషయం తెలిసిందే. కిడ్నాప్‌ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు.

ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన దుర్గేశ్‌.. అలిసిపోయి ఉండటంతో స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్.. తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్‌రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. 

దీంతో స్టేషన్‌లో ఉన్న జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు.
చదవండి: బీజేపీకి సోమారపు రాజీనామా! 

 
Advertisement
 
Advertisement