Telugu Top News: మార్నింగ్‌ హైలైట్‌ న్యూస్‌

26th Nov 2022 Top 10 News: TSPSC Group 4 Notification Posts Details - Sakshi

1. AP: సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

2. శాఖల వారీగా గ్రూప్‌–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు..
రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్‌–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. పోస్టుల వివరాలు ఇవే..
పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్‌ దృష్టి
శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్‌ గేమ్‌.. ఇంకెన్ని దారుణాలు చూడాలో..
ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే
అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

7. Neena Rao: విజేత తల్లి
ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్‌ కావచ్చు. బిల్‌ గేట్స్‌ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

8. మాదాపూర్‌ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్‌మెంట్‌ అక్కడ మొదలైంది!
‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్‌ అభివృద్ధి.. 2007లో రియల్‌ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్‌ ఇదే తరహా డెవలప్‌మెంట్‌ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

9. వాషింగ్టన్‌ సుందర్‌ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు
ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

10. టాలీవుడ్‌లో మాస్‌ జాతర.. పూనకాలు తెప్పిస్తారట!
టికెట్లు బాగా తెగాలంటే మాస్‌ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్‌ సినిమాలే ఉంటాయి. ఆ మాస్‌ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్‌ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్‌ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం...
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top