AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. పోస్టుల వివరాలు ఇవే..

6511 New Police Posts To Be Filled In AP - Sakshi

సాక్షి, అమరావతి: పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది.

మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది. డిసెంబర్‌ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

పోలీసు నోటిఫికేషన్‌ పోస్టుల వివరాలు ఇవీ
ఎస్సై (సివిల్‌): 387, ఎస్సై (ఏపీఎస్పీ) పోస్టులు : 96, పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) పోస్టులు: 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ (ఏఆర్‌ బెటాలియన్‌)పోస్టులు:  2,520
చదవండి: సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top