21 Years Old Woman Dies Of Electric Shock At Neredmet, Another Student Died In Road Accident - Sakshi
Sakshi News home page

Hyderabad: రోడ్డు ప్రమాదంలో ఒకరు.. కరెంట్‌ షాక్‌తో మరొకరు!

Apr 3 2023 2:29 PM | Updated on Apr 3 2023 4:34 PM

21 Years Old Woman Dies Of Electric Shock AtNeredmet - Sakshi

సాయితేజ, వరలక్ష్మి(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: ఇంటి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌ తగిలి మహిళ మృతి చెందిన ఘటన నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులవివరాల ప్రకారం.. నేరేడ్‌మెట్‌ చంద్రబాబునగర్‌లో నివాసముండే ఏ.మణ్యం ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కోడలు వరలక్ష్మీ(21) కరెంట్‌ షాక్‌కు గురైంది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నేరేడ్‌మెట్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం 
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్‌ మీర్జాలగూడకు చెందిన సాయితేజ యాదవ్‌(23) ఓయూలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి స్నేహితుడి బైక్‌(కేటీఎం డ్యూక్‌) తీసుకొని బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్‌కు వెళ్లాడు.

తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా సాయిరాం థియేటర్‌ దాటిన తర్వాత బైక్‌కు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఫుట్‌పాత్‌ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయితేజ తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement