
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: గణపురం మండలం ధర్మారావు పేటలో పరుశరాంపల్లికి చెందిన 105 ఏళ్ల చింతిరెడ్డి ఆగమ్మ కరోనా టీకా వేయించుకున్నట్లు చెల్పూరు ఇన్చార్జి వైద్యా ధికారిణి ఉమాదేవి తెలిపారు. అంతటి వృద్ధురాలే ధైర్యంగా టీకా వేయించుకున్నారని, ఎవరూ అపోహలకు గురికావద్దని ఆమె పేర్కొన్నారు. అర్హులైన అందరూ టీకా వేయించుకొని కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. ఇలా కేంద్రానికి వచ్చి టీకా వేయించుకోవడం చూసి ప్రజలకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నింపింది.