ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం

Sarpanch Navya Got Emotional: Rajaiah Gave Proceeding Letter - Sakshi

సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వేధింపుల వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రామాభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే రాజయ్య ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వడంతో సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమక్షంలో రాజయ్య ఇచ్చిన ప్రొసీడింగ్ లేఖ చూపించి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరంటూ ప్రస్తుతం ఎమ్మెల్యే మంజూరు చేసిన రూ.25 లక్షలు గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వద్ద తన భర్త తీసుకున్న ఏడు లక్షలు ఏదైనా అమ్మి తిరిగి ఇచ్చేయాలని భర్తకు ఆల్టిమేటం ఇచ్చారు. తల తాకట్టు పెట్టైన ఏడు లక్షలు భర్త తిరిగి చెల్లించాల్సిందేనని సూచించారు. నిజాయితీగా ఎమ్మెల్యే వేధింపులపై పోరాటం కొనసాగిస్తానని, ఆధారాలతో మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని నవ్య చెప్పారు.


చదవండి: ఎమ్మెల్యే రాజయ్యపై నవ్య ఆరోపణలు.. కడియం కీలక వ్యాఖ్యలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top