సర్పంచ్‌ నవ్య వర్సెస్‌ ఎమ్మెల్యే రాజయ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Police Reaction On Sarpanch Navya Allegations On MLA rajaiah - Sakshi

సాక్షి, ధర్మసాగర్‌(హన్మకొండ): స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటి కొండ రాజయ్యపై ధర్మసాగర్‌ మండలం జాన కీపురం సర్పంచ్‌ కురుసపల్లి నవ్య చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో వాస్తవాలు లేవని పోలీసులు తేల్చినట్టు తెలిసింది. జూన్‌ 21న ఎమ్మెల్యే టి.రాజయ్య, ధర్మసాగర్‌ ఎంపీపీ నిమ్మ కవిత, ఎమ్మెల్యే పీఏ శ్రీనివాస్, నవ్య భర్త ప్రవీణ్‌లపై వేధింపుల ఆరోపణలు చేసిన నవ్య ధర్మసాగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

దీనిని సుమోటోగా తీసుకున్న జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌లు సర్పంచ్‌ నవ్య కేసుపై సమాచారం సేకరించాలని పోలీసులను ఆదేశించాయి. ఈ క్రమంలో వేధింపులకు సంబంధించిన ఆధారాలు అందజేయాలని కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, ధర్మసాగర్‌ సీఐ ఒంటేరు రమేశ్‌లు సర్పంచ్‌ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఆమె ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదని చెపుతున్నారు.

సర్పంచ్‌ నవ్య నిర్ణీత సమయానికి ఆధారాలు సమర్పించలేదని, ఆమె ఆరోపణలు అవాస్తవమని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లకు బుధవారం పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.  మరోవైపు ఇప్పటికే రెండు ఆడియోలు విడుదల చేసిన నవ్య.. కేసు నమోదు చేస్తేనే ఆధారాలు ఇస్తానని చెబుతోంది.
చదవండి: ఇక నేను తప్పుకుంటా, సీఎంకు తెలియజేయండి.. జెన్‌కో సీఎండీ వ్యాఖ్యలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top