PM Modi Warangal Tour Tomorrow On July 8th, Check Complete Schedule Details Inside - Sakshi
Sakshi News home page

PM Modi Warangal Tour: రేపు వరంగల్‌కు ప్రధాని మోదీ

Jul 7 2023 3:14 AM | Updated on Jul 7 2023 9:42 AM

PM Modi to Warangal tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లా పర్యటనలో పాల్గొననున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అధికారిక సమాచారం మేరకు ప్రధాని మోదీ పర్యటన వివరాలిలా ఉన్నాయి.

♦ శనివారం ఉదయం 7–35 గంటలకు వారణాసి ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. 
♦ 9–25 గంటలకు హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
♦ 9–30 గంటలకు ఎంఐ–17 హెలికాప్టర్‌లో హకీంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి వరంగల్‌కు బయలుదేరతారు.
♦10–15 గంటలకు మామ్నూర్‌లోని హెలిపాడ్‌కు చేరుకుని, రోడ్డుమార్గాన భద్రకాళి ఆలయానికి బయలుదేరతారు. 
♦ 10–30 గంటల నుంచి 10–50 గంటల వరకు ఆలయంలో పూజల అనంతరం హనుమకొండలోనిఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌కు బయలుదేరతారు. 
♦ 11–00 గంటలకు అక్కడికి చేరుకుని 11–35 గంటల వరకు వివిధ అభివృధ్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 
♦ 11–40 గంటలకు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ గ్రౌండ్‌లోని బహిరంగ సభ వేదికకు బయలుదేరి 11–45 గంటలకు అక్కడికి చేరుకుంటారు. 
♦ 11–45 నుంచి 12–20 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 
♦ 12–20 నుంచి 12–30 గంటల వరకు విశ్రాంతి. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 12–50 గంటలకు హెలిపాడ్‌కు చేరుకుంటారు. 
♦ 12–55 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 1–40 గంటలకు హకీంపేట్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
♦ 1–45 గంటలకు ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌లోని బికనీర్‌కు వెళతారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement