బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన | Hyderabad: Cm Kcr Laid Foundation Stone For Brs Party Office Kokapet | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

Jun 5 2023 12:31 PM | Updated on Jun 5 2023 1:34 PM

Hyderabad: Cm Kcr Laid Foundation Stone For Brs Party Office Kokapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్‌ఎస్‌.. తాజాగా హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోకాపేటలో నిర్మించినున్న భారత్‌ భవన్‌కు సీఎం కేసీఆర్‌ సోమవారం శంకుస్థాపన చేశారు. 

ఈ భవన్‌కు సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్ హెచ్‌ఆర్డీగా పేరు పెట్టారు. కోకాపేటలో 11 ఎకరాల విస్తీర్ణంలో, మొత్తం 15 అంతస్థుల్లో భారత్‌ భవన్‌ నిర్మాణం జరగనుంది. ఈ కార్యాలయంలో అతి పెద్ద డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో కార్యకర్తలకు అవగాహణ కార్యక్రమాలు, శిక్షణా తరగతులు నిర్వహించేలా భవన నిర్మాణం జరగనుంది.

చదవండి: నాన్న లే.. బుజ్జగించ నాన్న లేడు.. లాలించగ అమ్మ రాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement