తెలంగాణకు అలర్ట్‌.. వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు | High temperatures from tomorrow | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అలర్ట్‌.. వారం రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు

Jun 5 2023 5:05 AM | Updated on Jun 5 2023 7:14 AM

High temperatures from tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం నుంచి వారం రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ అంతటా పగ టి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌ వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

కాగా, రాష్ట్రంలో ఆదివారం కొన్నిచోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో ఆదివారం అత్యధికంగా 45.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదైంది. సోమవారం ఒక్క రోజు మాత్రం రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

అక్కడక్కడ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా దక్షిణ చత్తీస్‌ఘడ్‌ పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement