మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి | Fire Accident Minister prashanth reddy Visit | Sakshi
Sakshi News home page

పటాకులు పేల్చిన్రు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి

Jun 8 2023 4:47 PM | Updated on Jun 8 2023 4:48 PM

Fire Accident Minister prashanth reddy Visit - Sakshi

చీమలపాడు ఘటన మరువక మునుపే.. అలాంటి పరిస్థితులను.. 

సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపెట్ గ్రామంలో ఊరుర చెరువుల పండగకు ఆయన హాజరు అయ్యారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. 

బాణాసంచా భారీ సంఖ్యలో పేల్చడంతో.. అవి కాస్త పక్కనే ఉన్న టెంట్‌పై పడ్డాయి. ఆ ప్రభావంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. స్థానికులు సత్వరమే స్పందించి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా.. బాణాసంచాతో పెను ప్రమాదమే జరిగింది. అగ్ని ప్రమాదం.. దానికి కొనసాగింపుగా సిలిండర్లు పేలడంతో నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement