నిమ్స్‌లో 2 వేల పడకల భవనానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

CM KCR foundation stone For 2000 Bed Block In NIMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిమ్స్‌ దవాఖాన విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం  భూమిపూజ చేశారు.  మొత్తం 33 ఎకరాల్లో చేపడుతున్న నిమ్స్‌ విస్తరణ పనులకు ప్రభుత్వం రూ. 1,571 కోట్లు కేటాయింది. అదే విధంగా నిమ్స్‌లో.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మిస్తున్న దశాబ్ధి బ్లాక్‌కు నూతన భవనం ‘దశాబ్ది టవర్‌’కు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. కాగా  కొత్త భవనం నిర్మాణంలో 4వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటళ్ల జాబితాలోకి నిమ్స్‌ చేరనుంది.

కొత్త బ్లాక్‌ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా 2 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం మూడు బ్లాక్‌లుగా దశాబ్ది టవర్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఓపీ,ఏపీ, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేక బ్లాక్‌లు నిర్మిస్తున్నారు. ప్రత్యేకంగా ఓపీ సేవల కోసం 8 అంతస్తుల్లో ఓ బ్లాక్‌, ఎమర్జెన్సీ సేవల కోసం 8 అంతస్తులతో ఓ బ్లాక్‌ నిర్మాణం చేస్తున్నారు. ఇన్‌ పేషంట్ల కోసం 13 అంతస్తులతో మరో బ్లాక్‌ నిర్మిస్తున్నారు. కొత్త భవనంలో మొత్తం 30 ఆపరేషన్‌ ధియేటర్లు ఉండనున్నాయి. ప్రతి రోజు నిమ్స్‌కు రోజుకు 2000-3000 ఔట్‌ పేషెంట్లు వస్తుంటారు.

న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ
నిమ్స్‌లో న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీని కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆరుగురు గర్భిణులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేశారు.  రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ జరగుతుండగా.. తెలంగాణలో 6.8 లక్షల మంది గర్భిణులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందులో మొత్తం 8 రకాల వస్తువులు కిట్‌లో అందిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిమ్స్‌ను 17 వేల పడకల నుంచి 50 వేల పడకలకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. 550 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 4 వేల పడకలతో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రుల్లో ఒకటిగా నిమ్స్‌ ఉండనుందని అన్నారు.
చదవండి: సీడబ్ల్యూసీకి కొత్త టీమ్‌! తెలంగాణ నుంచి ఒకరికి చాన్స్‌?  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top