వాకథాన్‌కు స్పందన | - | Sakshi
Sakshi News home page

వాకథాన్‌కు స్పందన

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

తిరువళ్లూరు: డ్రగ్స్‌ రహిత రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తిరువళ్లూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దామోధరన్‌ పిలుపు నిచ్చారు. తిరువళ్లూరు పట్టణంలోని ఆర్‌హెచ్‌ఎస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగ తమిళనాడును తీర్చిదిద్డడం, డెంగీ నివారణ, ట్రాఫిక్‌ నిబంధనలను పాటించడం లాంటి విషయాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పట్టణంలోని ఆర్‌హెచ్‌ఎస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 50 వయస్సు పైబడిన వారి ఆధ్వర్యంలో వాకథాన్‌ను నిర్వహించారు. ఈ వాకథాన్‌ను దామోధరన్‌ జెండా ఊపి ప్రారంభించారు. రాజాజీపురం నుంచి ప్రారంభమైన వాకథాన్‌ జేఎన్‌ రోడ్డు, సివినాయుడు రోడ్డు మీదుగా సాగి మళ్లీ అదే రోడ్డు మీధుగా రాజాజీపురం వద్ద ముగిసింది. వాకథాన్‌లో సుమారు 200 మందికి పైగా పాల్గొని, రోడ్డు నిబందనలను పాటించాలి, మత్తు పదార్థాలు లేని రాష్ట్రంగా తమిళనాడును తీర్చిదిద్దాలని పిలిపునిచ్చారు. సంఘం అధ్యక్షుడు మురుగేషన్‌, కార్యదర్శి ఆనందకుమార్‌, కోశాదికారి రాజేష్‌కుమార్‌, ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్‌ దినేష్‌, కేఎం వైద్యశాల వైద్యురాలు బృందాదినేష్‌, నిర్వాహకులు డేనియల్‌ఈస్టర్‌రాజ్‌, లయన మూర్తి, తిరువూరు శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement