క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

రూ. 10 లక్షల విలువైన

మాదకద్రవ్యాల పట్టివేత

– ముగ్గురు అరెస్టు

తిరువొత్తియూరు : ఆవడి పోలీస్‌ కమిషనర్‌ సెంథిల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు రెడ్‌ హిల్స్‌ శాంతిభద్రతల విభాగం పోలీస్‌ ఇనన్‌స్పెక్టర్‌ కృష్ణమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం పాడియనల్లూర్‌ మైదానంలో నిఘా ఉంచింది. ఆ సమయంలో మోటారు సైకిల్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్‌ కబీర్‌, విజయ్‌ కుమార్‌, హరీష్‌ అనే ముగ్గురిని పోలీసులు తనిఖీ చేశారు. వారు మెథాబెటమైన్‌ అనే నిషేధిత హైగ్రేడ్‌ మాదకద్రవ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తేలింది. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 3 సెల్‌ఫోన్లు, సుమారు రూ. 10 లక్షల విలువైన 60 గ్రాముల మెథాబెటమైన్‌ మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో సంతోష్‌, కార్తీక్‌ అనే మరో ఇద్దరికి కూడా ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. మాదకద్రవ్యాలను పట్టుకున్న ప్రత్యేక బృందం పోలీసులను పోలీస్‌ కమిషనర్‌ సహా ఉన్నతాధికారులు అభినందించారు.

ఉరివేసుకుని పోలీసు ఆత్మహత్య

అన్నానగర్‌: త్రిశూలంలో ఓ పోలీసు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. చైన్నెలోని పరంగిమలై సాయుధ పోలీసు దళంలో పనిచేస్తున్న పోలీసు అధికారి అజిత్‌ కుమార్‌ (22), రామనాథపురం జిల్లాలోని పరమకుడికి చెందినవారు. ఆదివారం త్రిశూలం రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఒక చెట్టుకు ఉరి వేసుకు ని అజిత్‌ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మీనంబాక్కం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి, అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మానవ హక్కుల పరిరక్షణను నిర్ధారించండి

– జవహిరుల్లా పట్టు

కొరుక్కుపేట : మదురై జిల్లాలోని సెక్కనూరాని పోలీస్‌ స్టేషన్‌కు విచారణ నిమిత్తం తీసుకువెళ్లిన లారీ డ్రైవర్‌ బాలకష్ణన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే ఉరి వేసుకుని కనిపించాడన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను కలిగించింది. ఈ ఘట నకు సంబంధించి ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం సీబీసీఐడీకి బది లీ చేశారు. నాగర్‌కోయిల్‌ పోలీసులు సెకనూరాని పోలీస్‌ స్టేషన్‌లో ఒక పోలీస్‌ అధికారి మరణం తరువాత జరిగిన మరో ఘటన, తమిళనాడులోని ఆ పోలీస్‌ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడిస్తోంది. ఈ విషయంలో, కడలూరు జిల్లాలో ఒక్క రోజులోనే ఏడుగురు యువతులతో సహా 12 మంది అదృశ్యమయ్యారన్న సమాచారం కూడా ఆందోళన కలిగిస్తోంది. పోలీస్‌ స్టేషన్లలో మానవ హక్కుల పరిరక్షణ, విచారణకు పిలిపించిన వారి ప్రాణానికి భద్రత కల్పించేలా తమిళనాడు ప్రభు త్వం కూడా చర్యలు తీసుకోవాలనీ మనిద నేయ మక్కల్‌ కచ్చి అధ్యక్షుడు జవహిరుల్లా కోరారు.

పారిశుద్ధ్య డ్రైవ్‌

– 78 టన్నుల వ్యర్థాల తొలగింపు

సాక్షి, చైన్నె : ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన నివాస వాతావరణాన్ని అందించే లక్ష్యంతో గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ భారీ స్థాయిలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించింది. నగరంలోని తమిళనాడు పట్టణ నివాస అభివృద్ధి మండలి నివాస సముదాయాలన్నింటిలో చేపట్టిన ఈ తీవ్ర పారిశుద్ధ్య డ్రైవ్‌ ద్వారా ఏకంగా 78 టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు కార్పొరేషన్‌ ఆదివారం ప్రకటించింది.నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఆటస్థలాల్లో పేరుకుపోయిన 51 టన్నుల చెత్తతో పాటు, 27 టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను (డెబ్రిస్‌) పూర్తిగా తొలగించారు. భవనాల చుట్టుపక్కల పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి, పొదలను కత్తిరించి, నిరుపయోగంగా పడి ఉన్న పాత వస్తువులను అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రత్యేక పారిశుద్ధ్య పనుల్లో కార్పొరేషన్‌ తరఫున 1,142 మంది పారిశుద్ధ్య కార్మికులు, 225 వాహనాలు నిమగ్నమయ్యాయి.

రూ. 8.21 కోట్ల

దుర్వినియోగం

– మెనేజర్‌ అరెస్టు చేసిన పోలీసులు

కొరుక్కుపేట: అంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్‌ కంపెనీలో రూ. 8.21 కోట్లు దుర్వినియోగం చేసిన మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీ ఆదాయాన్ని ప్రస్తుతం అవడి, అంబత్తూర్‌ ఎస్టేట్‌లో ఉన్న ఒక ప్రైవేట్‌ కంపెనీ ప్రాసెస్‌ చేస్తోంది. ఈ కంపెనీలో సుధీర్‌కట్టి గాంధీ అకౌంట్స్‌ మేనే జర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల ఖర్చులను తనిఖీ చేయగా, రూ. 8.21 కోట్లు దుర్వినియోగం అయినట్లు వెల్లడైంది. దీని తర్వాత, కంపెనీ తరఫున అవడి సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తదనుగుణంగా, పోలీస్‌ కమిషనర్‌ డి. సెంథిల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీ స్‌ శివకుమార్‌ పర్యవేక్షణలో, అదనపు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌) బాల మురుగన్‌ సలహా మేరకు, ఇన్‌స్పెక్టర్‌ చెంగోట్టువన్‌ నేతృత్వంలోని పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో అదే ప్రైవే ట్‌ కంపెనీలో జరిగిన మనీలాండరింగ్‌లో ఆ కంపెనీ మేనేజర్‌ అయిన సుధీర్‌కట్టి గాంధీ (30)కి ప్రమేయం ఉన్నట్లు వెల్లడైంది. దీంతో పరారీలో ఉన్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement