మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్య రహిత సమాజమే లక్ష్యం

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

● రెలాలో రైడ్‌ ఎగైనెస్ట్‌ డయాబెటిస్‌ సైక్లోథాన్‌

సాక్షి, చైన్నె: ఆరోగ్యకరమైన జీవనశైలి, మధుమేహ నివారణ , మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంపై అవగాహన కల్పించే లక్ష్యంతో చైన్నెలోని రేలా ఆసుపత్రి నిర్వహించిన రైడ్‌ ఎగైనెస్ట్‌ డయాబెటిస్‌ 2026 సైక్లోథాన్‌కు విశేష స్పందన లభించింది. చైన్నె సైక్లిస్ట్స్‌ ,నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది సైక్లింగ్‌ ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొ న్నారు. తాంబరం నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ వసంత కుమారి కమలకన్నన్‌, డిప్యూటీ మేయర్‌ జి. కామరాజ్‌ జెండా ఊపి ఈ సైక్లోథాన్‌ను ప్రారంభించారు.

ఆరోగ్యం కోసం ఒక రైడ్‌..

మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఒక స్వరం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ ఈవెంట్‌లో వివిధ ఫిట్‌ నెస్‌ స్థాయిల వారికి అనుగుణంగా మాన్‌సూన్‌ (150 కి.మీ.), సారల్‌ (75 కి.మీ.) , తూరల్‌ (25 కి.మీ.) అనే మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్‌ వసంత కుమారి కమలకన్నన్‌ మాట్లాడుతూ, అన్ని వయసుల వారిని చురుకుగా ఉంచడానికి, ఆరోగ్యంపై బాధ్య త పెంచడానికి సైక్లింగ్‌ ఒక అద్భుతమైన మార్గమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజలను దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకునేలా ప్రేరేపించడమే కాకుండా, డ్రగ్స్‌ రహిత సమాజం వంటి సామాజిక అంశాలపై అవగాహన పెంచుతాయని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. రేలా హాస్పిటల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ ఫరూక్‌ మాట్లాడుతూ సైక్లింగ్‌ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఇన్సులిన్‌ సున్నితత్వం పెరిగి టైప్‌–2 డయాబెటిస్‌ వంటి జీవనశైలి వ్యాధుల ముప్పు తగ్గుతుందని వివరించారు. నివారణ ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ వేదిక ఎంతగానో దోహదపడిందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement