క్లిక్‌తో మళ్లీ వస్తున్న ఓవియ | - | Sakshi
Sakshi News home page

క్లిక్‌తో మళ్లీ వస్తున్న ఓవియ

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

తమిళసినిమా: ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో కథానాయకిగా నటించిన నటి ఓవియ. కాగా ఇటీవల ఆ అమ్మడు తమిళసినిమాల్లో కనిపించలేదు. అలాంటిది తాజాగా ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నారు. దీనికి క్లిక్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. జేఆర్‌పీ ఇంటర్నేషనల్‌ సినీ ఆర్ట్స్‌ సతాకంపై రాజప్రభు నిర్మిస్తూ, కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. సుందర్‌ మహాశ్రీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవల ప్రారంభం అయ్యి శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో దర్శకుడు సుందర్‌ మహాశ్రీ,అస్మిత, అముదవానన్‌, లొల్లుసభ మనోహర్‌, సల్మా పైరోస్‌,అరుళ్‌ సెల్వం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్‌కుమార్‌ ఛాయాగ్రహణం, జోసెఫ్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్న సయ్యద్‌ జాఫర్‌ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది యూత్‌పుల్‌ సస్పెన్స్‌ ఎంటర్‌టెయినర్‌ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. జెన్‌జీ తరానికి బాగా కనెక్ట్‌ అయ్యే సన్నివేశాలతో రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉంటుందన్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ క్లిక్‌ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను వరుసగా వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ క్లిక్‌ నటి ఓవియ కెరీక్‌కు ఏ మాత్రం ప్రయేజనాన్ని చేకూర్చుతుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement