తమిళసినిమా: సంచలన నటులలో మన్సూర్ అలీఖాన్ ఒకరు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈయన సినిమా రంగానికి విలన్‌గా పరిచయం అయ్యి, హీరోగా మారి, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా అవతారమెత్తిన తనకుంటూ ప్రత్యేక స్టానాన్ని పొందారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వివిధ పాత్రల్లో నటిస్తున్న ఈయన గత 34 ఏళ్ల క్రితం హీరోగా నటించి, నిర్మించిన చిత్రం రాజాదిరాజ రాజ కులోత్తుంగ రాజమార్తాండ రాజగంభీర కార్తవరాయ కృష్ణ కామరాజన్. తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే చిత్రానికి ఇంత పొడుగైన పేరును పెట్టిన నటుడు, నిర్మాత మన్సూర్ అలీఖాన్‌నే అవుతారు. ఈ చిత్రాన్ని రాజ్ కెనడీ పతాకంపై మన్సూర్ అలీఖాన్ నిర్మించడమే కాకుండా కథానాయకుడిగా, సంగీత దర్శకుడిగా, గీత రచయితగా బాధ్యతలను నిర్వహించడం విశేషం. కెప్టెన్ ప్రభాకర్ వంటి సూపర్‌హిట్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన తరువాత మన్సూర్ అలీఖాన్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం రాజాధిరాజ రాజకులోత్తుంగ రాజమార్తాండ రాజ గంభీర కార్తవరాయ కృష్ణ కామరాజన్. బాలు ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి నందిని, సిల్క్‌స్మిత, డిస్కోశాంతి, వడివుక్కరసి, అభిలాష, చర్మిళ, నాగేశ్, వీకే.రామసామి, నెపోలియన్, జయ్‌గణేశ్, వెన్నిరా అడై మూర్తి, ఎస్‌ఎస్.చంద్రన్, ఆర్.సుందరరాజన్, గుండు కల్యాణరం మొదలగు 50 మంది ప్రముఖులు నటించడం విశేషం. ఇందులోని పాటలను ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం, స్వర్ణలత, చంద్రబోస్ మొదలగు గాయనీ గాయకులు పాడారు. చిత్రంలోని పాటలన్నీ హిట్ అయ్యారు. ఈ చిత్రం ద్వారానే తంగర్‌బచ్చన్ ఛాయాగ్రహకుడిగా పరిచయం అయ్యారు. పొలిటికల్ సైటెరికల్‌గా రూ పొందిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాదించింది. కాగా సుమారు 34 ఏళ్ల తరువాత ఈ చిత్రాన్ని డిజిటల్ ఫార్మెట్‌లో సరికొత్త హంగుల తో వచ్చే ఏడాది జనవరి లో రీరిలీజ్ చేయనున్నరట్లు మన్సూర్ అలీ ఖాన్ వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


