తమిళసినిమా: ట్విట్టర్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాలు వచ్చిన తరువాత మన గురించి ఇంకొకరు ప్రచారం చేయాల్సిన అవసరం లేకపోయింది. మన గురించి మనమే ప్రచారం చేసుకునే సౌలభ్యం వచ్చేసింది. దీంతో అన్ని రంగాల్లో మాదిరిగానే సినిమా రంగంలోనూ స్వయం ప్రచారం పెరిగిపోతోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల రామాయణం చిత్రం తెరపైకి వచ్చి దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో రాముడిగా నటించిన రణ్‌వీర్ కపూర్ గురించి రావణుడిగా నటించిన యష్, సీతగా నటించిన సాయిపల్లవి గురించే ప్లస్ అయినా, మైనస్ అయినా చెప్పుకుంటున్నారు. చివరికి రావణుడి సోదరిగా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా తక్కువలో తక్కువైనా చెప్పుకుంటున్నారు. అయితే రావణుడి సతీమణి మండోదరిగా నటించిన కాజల్ అగర్వాల్ గురించి ఎవరూ చెప్పుకోడం లేదు. చిత్ర తొలి భాగంలో మండోదరిగా కాజల్ అగర్వాల్ కనిసించింది ఒకటి రెండు సన్నివేశాల్లోనే కావచ్చు. అయితే ఇంతకు ముందు వరకూ అగ్ర కథానాయకిగా రాణించిన ఈ భామను మండోదరిగా ఎవరూ పట్టించుకోలేదనే చెప్పాలి. అయితేనేం తన గురించి తనే చెప్పుకుంటున్నారీమె . తన ఇన్‌స్ట్రాగామ్‌లో మండోదరి పాత్రకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేసి రామ యాణం చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. పాత్ర చిన్న దా ? పెద్దదా ? అన్నది కాకుండా ఒక గొప్ప ఇతిహాసం కథా చిత్రంలో నేనూ భాగం కావడం సంతోషకరం. అంతే కాకుండా మండోదరి వంటి మహా స్వాధ్వీ పాత్రలో నటించడం మంచి అనుభవం. మండోదరిగా బాగున్నావంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు అని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా రామామణం రెండో భాగంలో ఈ భామ పాత్ర ఏమేరకు ఉంటుందో చూడాలి.


