ఘనంగా ‘వన్‌ నాచ్‌ బెటర్‌ పుస్తకావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘వన్‌ నాచ్‌ బెటర్‌ పుస్తకావిష్కరణ

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

కొరుక్కుపేట: చైన్నెలో విశ్రాంత అదనపు ప్రధాన కార్యదర్శి అయిన హర్మందర్‌ సింగ్‌(ఐఏఎస్‌) రచించిన ’వన్‌ నాచ్‌ బెటర్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ జె.సి.డి. ప్రభాకర్‌ పాల్గొని హర్మందర్‌ సింగ్‌ రచించిన ’వన్‌ నాచ్‌ బెటర్‌’ అనే పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి పి. జ్యోతిమణి మొదటి ప్రతిని అందుకున్నారు. అనంతరం స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ మాట్లాడుతూ తారాపురం సబ్‌–కలెక్టర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి, పట్టు పరిశ్రమ, రవాణా, ఆరోగ్యం, చేనేత వస్త్ర పరిశ్రమ, పురపాలక పరిపాలన , నీటి సరఫరా ( ఎం ఏ డబ్ల్యూ ఎస్‌) వంటి అనేక శాఖలకు అధిపతిగా ‘నిష్కపటంగా‘ సేవలందించినందుకు హర్మందర్‌ సింగ్‌ను ప్రశంసించారు. కాగా ఈ పుస్తకం ఆత్మకథ కాదని, వివిధ పరిపాలనా హోదాలలో 35 ఏళ్ల అనుభవం ద్వారా తాను పొందిన జ్ఞానమని పుస్తక రచయిత హర్మందర్‌ సింగ్‌ అన్నారు. న్యూఢిల్లీలోని తన ఇంటికి దూరంగా తమిళనాడు లోని తారాపురంలో పోస్టింగ్‌ వచ్చినప్పుడు, తమిళనాడు తన సొంత ఇల్లు అవుతుందని ఆయన ఎప్పుడూ అనుకోలేదని అన్నారు .రాష్ట్రంలో నా వృత్తిని ప్రారంభించినప్పుడు న్యూఢిల్లీలో నాకు ఇల్లు ఉన్నప్పటికీ, నా పిల్లలు ఈ నగరంలో స్థిరపడటంతో చైన్నెయే మా ఇల్లుగా మారిందిని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement