సాక్షి, చైన్నె: తమిళనాడులో కోడిపందాలపై ఎలాంటి నిషేధం విధించలేదని, కేవలం వాటిని క్రమబద్ధీకరించడానికి మాత్రమే ఒక ఉత్తర్వులు జారీ చేశామని మద్రాస్ హైకోర్టులో డీజీపీ తరపు న్యాయవాదులు వివరణ ఇచ్చారు. ఈరోడ్, నామక్కల్ జిల్లాల్లోని ఆలయ ఉత్సవాల్లో కోడిపందాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈరోడ్‌కు చెందిన ఆర్. అరుణ్‌కుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసు నిబంధనలకు లోబడి, జూదానికి తావు లేకుండా, జంతువులకు ఎలాంటి హింస జరగకుండా ఈ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈదృష్ట్యా డీజీపీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి పందాలకు అనుమతి ఇప్పించాలని కోరారు.
డీజీపీ వివరణ:
జస్టిస్ వి.లక్ష్మీనారాయణన్ బెంచ్‌లో ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి డీజీపీ కోర్టుకు సమర్పించిన వివరణలో కీలక విషయాలు వెల్లడించారు. హైకోర్టు మదురై బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకే కోడిపందాలను నియంత్రించేందుకు ఉత్తర్వులు జారీ చేయబడిందే తప్ప, పందాలపై ఎటువంటి పూర్తి నిషేధం లేదని వివరించారు. డీజీపీ ఇచ్చిన వివరణను నమోదు చేసుకున్న న్యాయమూర్తి.. కోడిపందాలపై ఎలాంటి నిషేధం లేనందున, పిటిషనర్ సంబంధిత పోలీసు అధికారులను నేరుగా సంప్రదించి అవసరమైన అనుమతులు పొందవచ్చని స్ప చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.


