టాస్మాక్‌ ఉద్యోగులకు శుభవార్త | - | Sakshi
Sakshi News home page

టాస్మాక్‌ ఉద్యోగులకు శుభవార్త

Sep 22 2026 5:16 AM | Updated on Sep 22 2026 5:16 AM

● పండగకు రూ.20,000 అడ్వానన్స్‌ ● కొత్త యూనిఫామ్స్‌ కూడా..

సాక్షి, చైన్నె: తమిళనాడులోని టాస్మాక్‌ రిటైల్‌ దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే కానుకలను ప్రకటించింది. పండగ ఖర్చుల కోసం సంవత్సరానికి ఒకసారి రూ. 20,000 వడ్డీ లేని ముందస్తు అడ్వాన్స్‌ అందించడంతో పాటు, సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లకు కొత్త యూనిఫామ్స్‌ను ప్రవేశపెడుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అర్హులైన టాస్మాక్‌ ఉద్యోగులందరూ ఈ పండగ అడ్వాన్స్‌ను పొందవచ్చు.పొంగల్‌, దీపావళి, క్రిస్మస్‌, రంజాన్‌, బక్రీద్‌ వంటి తమకు నచ్చిన పండగ ఏదో ఒకదానిని ఎంచుకుని ఉద్యోగులు ఈ మొత్తాన్ని తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు.ఈ మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా 10 నెలల వాయిదాల పద్ధతిలో వేతనం నుంచి మినహాయించనున్నారు. అంటే ప్రతినెలా రూ. 2,000 చొప్పున ఉద్యోగి జీతం నుండి కోత విధించబడుతుంది. ఒకవేళ పూర్తి రుణం చెల్లించక ముందే ఉద్యోగి సర్వీస్‌ నుండి విరమించుకున్నా లేదా పదవీ విరమణ చేసినా, వారి తుది బకాయిల నుండి మిగిలిన మొత్తాన్ని ఒకేసారి మినహాయిస్తారు. టాస్మాక్‌ సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు , అసిస్టెంట్లకు సంవత్సరానికి 3 జతల యూనిఫాంతో పాటు కుట్టుకూలి కింద రూ. 6,000 అందించనున్నారు. టాస్మాక్‌ అధికారిక లోగోతో కూడిన ఈ కొత్త దుస్తుల డిజైన్‌ను యాజమాన్యం విడుదల చేసింది. సేల్స్‌మెన్‌ – అసిస్టెంట్లకు లేత గోధుమ రంగు షర్ట్‌, ముదురు బూడిద రంగు ప్యాంట్‌. సూపర్‌వైజర్లకు నీలం రంగు షర్ట్‌, ముదురు నీలం రంగు ప్యాంట్‌ కేటాయించారు. నవంబర్‌ 15వ తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని టాస్మాక్‌ దుకాణాల ఉద్యోగులు ఈ కొత్త యూనిఫామ్‌ విధానాన్ని విధిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement