● విద్యార్థులకు పిలుపు
సాక్షి, చైన్నె: విద్యార్థులు నైతికత, కరుణ, సేవా భావంకు ప్రాధాన్యతను ఇవ్వాలని వక్తలు పిలుపున ఇచ్చారు. కాటాన్ కొళత్తూరులోని ఎస్‌ఆర్‌ఎం ఐఎస్‌టీ టీపీ గణేశన్ ఆడిటోరియంలో 2026 విద్యా సంవత్సరానికి గానూ ఎంబీబీఎస్ –250), బీడీఎస్ – 100) విద్యార్థుల ప్రవేశ కార్యక్రమం సోమవారం జరిగింది. వైద్య విద్యలోకి అడుగుపెడుతున్న కొత్త విద్యార్థులకు అకడమిక్ ఎక్సలెనన్స్, నైతికత, కరుణ, సేవాభావం ప్రాముఖ్యతను ఈ వేదికపై ప్రముఖులు వివరించారు. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ప్రొఫెసర్ వి.బి. నారాయణ మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య వృత్తిలో వైట్ కోట్ ధరించడం గొప్ప గౌరవం అని, అదే సమయంలో దానితో పాటు ఎంతో బాధ్యత, నిజాయితీ అవశ్యమన్నారు. డాక్టరైనా సరే, రోగులతో వ్యవహరించేటప్పుడు ఎప్పుడూ అత్యంత వినయంగా ఉండాలని సూచించారు. ఆ విద్యా సంస్థ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముత్తమిళ్ సెల్వన్, అదనపు రిజిస్టార్ టి మైఽథిలి, డీన్ ప్రొఫెసర్‌ఆర్‌జయంతి, దంత వైద్య కళాశాల డీన్ ఎన్ వివేక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా విద్యార్థుల చేత హిప్పోక్రటిక్ ఓత్ వైద్య ప్రమాణ స్వీకారం చేయించారు. వైద్య రంగంలో బాధ్యతాయుతమైన నిపుణులుగా ఎదగాలని ఆకాంక్షించారు.


