పోలో సీజన్‌ విజేతగా హిందూస్థాన్‌ టీమ్‌ | - | Sakshi
Sakshi News home page

పోలో సీజన్‌ విజేతగా హిందూస్థాన్‌ టీమ్‌

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

సాక్షి, చైన్నె : ప్రతిష్టాత్మక బెంగళూరు పోలో సీజన్‌లో చైన్నె హిందూస్థాన్‌ యూనివర్సిటీ పోలో టీమ్‌ సంచలన విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ది ఓన్లీ వన్‌ కప్‌ – ఎగ్జిబిషన్‌ టైటిల్‌ గేమ్‌లో బిలియనీర్‌ పోలో క్లబ్‌ను 4–3 తేడాతో ఓడించి ట్రోఫీని కై వసం చేసుకుంది. బెంగళూరు పోలో సీజన్‌లో హిందూస్థాన్‌ యూనివర్సిటీకి ఇది తొలి ప్రధాన పోలో టైటిల్‌ కావడం విశేషం. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రోత్సహిస్తున్న విశ్వవిద్యాలయానికి ఈ విజయం ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది విజేత జట్టుకు ఆర్మీ సర్వీస్‌ కార్‌ప్స్‌ సెంటర్‌ కమాండెంట్‌, సేనా మెడల్‌ గ్రహీత బ్రిగేడియర్‌ విక్రమ్‌ షెకావత్‌ ట్రోఫీని అందజేశారు. ఈసందర్భాన్ని పురస్కరించుకుని హిందూస్థాన్‌ యూనివర్సిటీ ఛాన్సలర్‌ డాక్టర్‌ ఆనంద్‌ జాకబ్‌ వర్గీస్‌ పేర్కొంటూ, బెంగళూరు పోలో సీజన్‌లో ఎగ్జిబిషన్‌ టైటిల్‌ను గెలుచుకోవడం హిందూస్థాన్‌ యూనివర్సిటీకి ఎంతో గర్వకారణంగా పేర్కొన్నారు. తమ పోలో జట్టు క్రమశిక్షణ, అంకితభావం, క్రీడా స్ఫూర్తికి ఈ విజయం నిదర్శనంగా వివరించారు. తమ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ అత్యున్నత శిఖరాలను చేరుకునేలా ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామంటూ పోలో విజేతలను అభినందించారు.

న్యాయ సలహా కమిటీకి ఛైర్మన్‌, సభ్యుల నియామకం

– ప్రభుత్వం చర్యలు

కొరుక్కుపేట: నివారణ నిర్బంధ చట్టం కింద అరెస్టు అయిన వారికి సలహా సంఘంగా పనిచేసేందుకు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వి. భారతిదాసన్‌ నేతృత్వంలో ఓ కమిటీని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. గూండాల నిరోధక చట్టం కింద, పదేపదే నేర కార్యకలాపాలకు పాల్పడే వారిని అదుపులోకి తీసుకునే అధికారాన్ని మెట్రోపాలిటన్‌ పోలీస్‌ కమిషనర్లు , జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. నిర్బంధ చట్టం కింద అదుపులోకి తీసుకున్న వారు తమ అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయవచ్చు. కానీ అంతకు ముందు, వారు సలహా కమిటీకి అప్పీల్‌ చేసుకోవచ్చు. ఈ కమిటీ సంబంధిత నిందితుడిని విడుదల చేయగలదు. అటువంటి సందర్భంలో సలహా సంఘం వారిని విడుదల చేస్తే, వారు హైకోర్టులో సమీక్ష పిటిషన్‌ దాఖలు చేయవలసిన అవసరం ఉండదు. పి. కలైయరసన్‌, వి. పార్థిబన్‌ నేతృత్వంలో ఈ సలహా కమిటీని చైన్నె , మదురైలలో ఏర్పాటు చేశారు. చైన్నెలోని సలహా కమిటీకి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వి. భారతీదాసన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు పార్థిబన్‌,మదురైలోని సలహా కమిటీకి చైర్మన్‌గా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి కె. కళ్యాణసుందరంతో పాటు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులు ఎన్‌. ఆదినాథన్‌, జి. ఇళంగోవన్‌ను తమిళనాడు ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభు త్వం బుధవారం కీలక ఉత్తర్వు జారీ చేసింది.

సృజనాత్మకతే లక్ష్యంగా ‘ఎడిట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’

సాక్షి, చైన్నె : యువ, వర్ధమాన క్రియేటర్లలోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా కొత్తగా ‘ఎడిట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ప్రారంభించింది. సాధారణ, అన్‌పాలిష్డ్‌ వీడియో క్లిప్పులను ఇన్‌స్ట్రాగామ్‌ ప్రత్యేక ఎడిట్స్‌ యాప్‌ ద్వారా సినిమాటిక్‌ రీల్స్‌గా మార్చి తమ ప్రతిభను చాటుకునేందుకు క్రియేటర్లకు ఇది ఒక గొప్ప అవకాశంకల్పించారు. ఈ విషయంగా మెటా ఇండియా గ్లోబల్‌ పార్ట్‌నర్‌షిప్స్‌ హెడ్‌ అంకిత్‌ రిహాల్‌ మాట్లాడుతూ, క్రియేటర్లు ప్రతిరోజూ కొత్త తరహా కథనాలతో అలరిస్తున్నారని, వారిలోని ప్రతిభను మరింత ప్రోత్సహించడమే ఈ ఎడిట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ముఖ్య ఉద్దేశంగా ప్రకటించారు. తాము తాజాగా శ్రీకారం చుట్టిన ఈ కాంటెస్ట్‌ రాబోయే 45 రోజుల పాటుగా జరుగుతుందని, అక్టోబర్‌ 8వ తేదీ వరకు క్రియేటర్లు తమ ప్రతిభను చాటుకోవచ్చు అని వివరించారు.

ప్రత్యేక స్క్రీనింగ్‌ – అవార్డులు

సమర్పించిన ఎంట్రీల నుండి అత్యుత్తమంగా నిలిచిన టాప్‌ 10 నుండి 20 రీల్స్‌ను మెటా నిర్వహించే ప్రత్యేక ఎడిట్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్‌ చేయనున్నామన్నారు. ఎంపికై న క్రియేటర్లను ప్రముఖ జ్యూరీ సభ్యులు అభినందించడమే కాకుండా, వారి రీల్స్‌ను మెటా ఇండియా అధికారిక సోషల్‌ మీడియా ఖాతాల్లో ప్రదర్శిస్తారని తెలిపారు.విజేతలకు ఎడిట్స్‌ యాప్‌లో రాబోయే కొత్త ఫీచర్లను ముందస్తుగా వాడే అవకాశం లభిస్తుందన్నారు. పోటీలో వచ్చే రీల్స్‌ను ఎంపిక చేయడానికి వినోద, క్రియేటర్‌ రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేశారు. ఇందులో నటి అహసాస్‌ చన్నా , కంటెంట్‌ క్రియేటర్‌ డాలీ సింగ్‌ యువా కో ఫౌండర్‌ నిఖిల్‌ తనేజా,ప్రముఖ ఫిల్మ్‌క్రిటిక్‌ రాజీవ్‌ మసంద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement