డీఎంకే కొత్త జిల్లాల జాబితా సిద్ధం | - | Sakshi
Sakshi News home page

డీఎంకే కొత్త జిల్లాల జాబితా సిద్ధం

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

– ఒకటి రెండురోజుల్లో విడుదల

సాక్షి, చైన్నె : కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానానికి అనుగుణంగా డీఎంకే పార్టీలో 110 కొత్త జిల్లాలకు సంబంధించిన జాబితాను ఆపార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ సిద్ధం చేసి ఉన్నారు.ఒకటి రెండు రోజులలో ఈ జాబితాను విడుదల చేయడానికి పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. వివరాలు.. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమి పాలైన నేపథ్యంలో, ఓటమికి గల కారణాలను అన్వేషించేందుకు ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ అందించిన నివేదిక ఆధారంగా ఇటీవల డీఎంకే కార్యవర్గ సమావేశం నిర్వహించి తొమ్మిది కీలక తీర్మానాలను ఆమోదించారు. ఇందులో డీఎంకే జిల్లాల సంఖ్యను 110కి పెంచడం అనే తీర్మానం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పార్టీ అధిష్టానం ఆ 110 జిల్లాల జాబితాను విడుదల చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది.అన్నా అరివాలయం వర్గాల సమాచారం ప్రకారం ఈ జాబితాను సిద్ధం చేసి, తుది కసరత్తులు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కార్యవర్గ తీర్మానం ఆధారంగా 110 జిల్లాల జాబితా రూపకల్పన, ఆయా జిల్లాలకు కొత్త నిర్వాహకుల నియామకం కసరత్తులలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ నిమగ్నమయ్యారు.

ఇన్‌ ఛార్జ్‌ల నియామకం వాయిదా

ప్రారంభంలో ప్రతి జిల్లాకు ఒక ఇనన్‌ఛార్జ్‌ను నియమించేందుకు జాబితా సిద్ధం చేశారు. అయితే, ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తే వారు రాబోయే పార్టీ అంతర్గత ఎన్నికల్లో మళ్లీ తామే గెలిచేలా పావులు కదుపుతారని, దానివల్ల అంతర్గత ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగడంలో ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ ముఖ్య నాయకులు అధిష్టానానికి సూచించారు. సీనియర్‌ నాయకుల సలహాను అంగీకరించిన పార్టీ అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌, ప్రస్తుతం ఇన్‌ఛార్జ్‌ల నియామక ప్రకటనను వాయిదా వేశారు. అందుకే ఈ ప్రకటనలో కొంత ఆలస్యం జరిగింది. డీఎంకే అధిష్టానం 110 జిల్లాలకు సంబంధించిన అధికారిక విభజన జాబితాను నేరుగా ఒకటి రెండు రోజులలో విడుదల చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement