చైన్నెలో ‘మా కావేరి’ పేరిట పిల్లల ఆసుపత్రి..! | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో ‘మా కావేరి’ పేరిట పిల్లల ఆసుపత్రి..!

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

● ప్రారంభించిన మంత్రులు

సాక్షి, చైన్నె: మాతా పితృ రక్షణ, ప్రసూతి, గైనకాలజీ, సంతానలేమి, నియోనాటాలజీ – పీడియాట్రిక్‌ వైద్య సేవలు ఒకే గొడుగు కిందకు తీసుకొస్తూ రేడియల్‌ రోడ్డులో మా కావేరి పేరిట 120 పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. దీనిని బుధవారం మంత్రులు అరుణ్‌రాజ్‌, శరత్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కావేరి గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు – ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌. చంద్రకుమార్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మణివణ్ణన్‌ సెల్వరాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌, డాక్టర్‌ డి. శెంగుట్టువన్‌ పాల్గొన్నారు. 24 గంటల పాటుగా మాతృత్వ సేవలు ఇక్కడ అందించనున్నారు. కాన్పుకు ముందు, కాన్పు సమయంలో, కాన్పు తర్వాత అవసరమయ్యే సంపూర్ణ సంరక్షణను నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. ఈసందర్భంగా సెంగుటుటవన్‌ మాట్లాడుతూ, మహిళలు, పిల్లల ఆరోగ్య అవసరాలు చాలా ప్రత్యేకమైనవిగా వివరించారు. 2024 నుంచి తిరుచ్చిలో 200 పడకలతో విజయవంతంగా నడుస్తున్న శ్రీమా కావేరిశ్రీ ఆసుపత్రి అనుభవాన్ని, అత్యుత్తమ వైద్య నమూనాను ఇప్పుడు చైన్నె రేడియల్‌ రోడ్‌కు తీసుకువచ్చామని వివరించారు. అనుభవజ్ఞులైన నిపుణులైన డాక్టర్లతో చైన్నెలో పీడియాట్రిక్‌, ప్రసూతి వైద్య సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పడమేతమ లక్ష్యంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement