అయ్యప్ప స్వామి కథా చిత్రంలో రవి మోహన్‌? | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప స్వామి కథా చిత్రంలో రవి మోహన్‌?

Aug 27 2026 3:11 AM | Updated on Aug 27 2026 3:11 AM

తమిళసినిమా: జయం చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన జయంరవి తొలి చిత్రంతోనే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.అంతే కాదు ఆ తరువాత కూడా వరుసగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇటీవల ఈయనకు విషయాలే రావడం లేదు. ఆ మధ్య మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించి మంచి పేరుతో పాటు విజయాన్ని అందుకున్నారు.ఆ తరువాత వరుసగా చిత్రాలు చేస్తున్నా సక్సెస్‌ మాత్రం దరి చేయడం లేదు. మరో పక్క వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయి. చేస్తున్న చిత్రాల నిర్మాణాలు జాప్యం అవుతున్నాయి. కమ్‌ బ్యాక్‌ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు.అందులో భాగంగా ఇటీవల దర్శకుడిగా అవతారమెత్తి యోగి బాబు హీరోగా యాన్‌ ఆర్డినరీ మ్యాన్‌ అనే చిత్రాన్ని సొంతంగా తెరకెక్కిస్తున్నారు. అదేవిధంగా స్వీయ నిర్మాణంలో బ్రో కంపెనీ అనే చిత్రంలోనూ హీరోగా చిత్రాన్ని ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో రవి మోహన్‌ అయ్యప్ప స్వామిని నమ్ముకున్నట్లు తాజా సమాచారం. ఈయన అయ్యప్ప స్వామి భక్తుడు. ప్రతి ఏడాది అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి శబరిమలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. కాగా ఇటీవల తెలుగు స్టార్‌ నటుడు రవితేజ అయ్యప్ప స్వామి ఇతివృత్తంతో రూపొందిన ఇరుముడి చిత్రంలో కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో నటుడు రవికుమార్‌ ఆ తరహా కథలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసింది. ఇంతకు ముందు అయ్యప్ప స్వామి ఇతివృత్తంతో మాళికాపురం అనే చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్న మాలీవుడ్‌ దర్శకుడు విష్ణు శశి శంకర్‌ తో రవి మోహన్‌ చేతులు కలపడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయ్యప్ప స్వామి ఇతివృత్తంతో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement