తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా చిట్రత్తూరు గ్రామానికి చెందిన రూబన్(33). ఇతను అదే గ్రామానికి చెందిన విద్యుత్‌శాఖ అధికారిపై దాడి చేసిన ఘటనలో గత రెండు నెలల క్రితం అరెస్టయి ఇటీవల కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యాడు. కండిషన్‌లో భాగంగా వారానికి ఒకసారి వెంగల్ స్టేషన్‌కు వచ్చి సంతకం చేసి వెళ్లాల్సి వుంది. ఈ నేపద్యంలోనే మంగళవారం వెంగల్ స్టేషన్‌కు వచ్చిన రూబన్ సంతకం చేసిన తరువాత ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలుదేరిన సమయంలో ఐదుగురు యువకులు కారులో అతడ్ని వెంబడించి దారుణంగా హత్య చేశారు. పోలీసుల దర్యాప్తులో కీళానూర్ గ్రామానికి చెందిన ధీన, విక్కీ, నరేష్, పేరరసు, రాజ్‌కుమార్ తదితర ఐదుగురు కలిసి రూబన్‌ను హత్య చేసినట్టు నిర్దారించి వారిని అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరైన ధీన సోధరి దీపకు రూబన్‌కు మధ్య అక్రమ సంబందం వున్నట్లు విచారణలో గుర్తించారు. ధీప పెళ్లయిన తరువాత కూడా వీరి మధ్య అక్రమ సంబందం కొనసాగడంతో దీప భర్తకు విషయం తెలిసి ఇద్దరూ విడిపోయారు. దీంతో తల్లిదండ్రుల వద్ద వుంటున్న దీప, రూబన్ తరచూ కలిసే వారని అయితే గత 8 నెలల క్రితం ఇద్దరు మద్య ఘర్షణ ఏర్పడి ధీప ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలో తన సోదరి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఆమే ఆత్మహత్య చేసుకోవడానికి రూబనే కారణమని భావించి ప్రతీకారం తీర్చుకోవడానికి హత్య చేసినట్టు నిందితులు వెల్డించినట్లు తెలిసింది. దీంతో వారిని రిమాండ్‌కు తరలించారు.


