తిరుత్తణి: తిరుత్తణిలోని దళపతి వినాయకం మహిళల డిగ్రీ కళాశాలలో ఓనం వేడుకలు సందర్భంగా విద్యార్థునులు, ఆధ్యాపకులు కేరళ సంప్రదాయ దుస్తులతో వేడుకల్లో పాల్గొన్నారు. కళాశాల ఆవరణలో వివిధ పుష్పాలతో అత్తప్పు ముగ్గు వేసి ఓనం పండుగకు స్వాగతం పలికారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ బాలాజీ పాల్గొని దీపం ప్రజ్వలన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా కేరళ కతకళి నాట్యంతో పాటు కేరళలో ఓనం పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడంలో దాగివున్న చరిత్రకు సంబంధించి విద్యార్థినులు ప్రదర్శించిన నాట్యం, నాటకం ఆకట్టుకున్నారు.


