ఆటో డ్రైవర్‌ మృతి కేసు విచారణలో జాప్యం | - | Sakshi
Sakshi News home page

ఆటో డ్రైవర్‌ మృతి కేసు విచారణలో జాప్యం

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

– బంధువుల ధర్నా

తిరుత్తణి: తిరువలంగాడు సమీపంలోని చిన్నమ్మపేటకు చెందిన రాజరత్నం’30) ఆటో డ్రైవర్‌. ఈ ఏడాది జూలై 14న అతని మిత్రులు ఇద్దరితో కలిసి కనకమ్మసత్రంకు వెళ్లారు. వారిలో ఇద్దరు ఇళ్లకు చేరుకోగా రాజరత్నం మాత్రం ఇంటికి వెళ్లక పోవడతో కుటుంబీకులు పలు చోట్ల వెతికారు. ఈ క్రమంలో కనకమ్మసత్రం సమీపంలోని బావిలో ఆటో డ్రైవర్‌ రాజరత్నం మృతదేహం గుర్తించారు. ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 45 రోజులు కావొస్తున్నా ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఆగ్రహం చెందిన అతని కుటుంబీకులు బుధవారం కనకమ్మసత్రం పోలీస్‌ స్టేషన్‌ ముట్టడించి పక్కనే వున్న జాతీయ రహదారిలో బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో చైన్నె తిరుపతి జాతీయ రహదారిలో గంటపాటు రాకపోకలు స్తంభించాయి. తిరుత్తణి ఏఎస్పీ శుభమ్‌ దిమాన్‌ సంఘటన ప్రాంతం చేరుకుని ఆటో డ్రైవర్‌ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement