సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ | - | Sakshi
Sakshi News home page

సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అభిప్రాయ సేకరణ

Aug 27 2026 1:42 AM | Updated on Aug 27 2026 1:42 AM

తిరుత్తణి: తిరుత్తణి యూనియన్‌లోని కార్తికేయపురం ప్రాంతంలో 19 ఎకరాల విస్తీర్ణంలో ప్రయివేటు సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మాణంకు సంబంధించి ఆ ప్రాంతం ప్రజా స్పందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తిరువళ్లూరు జిల్లా డీఆర్‌ఓ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పాల్గొన్నారు. ప్రజలు తమ స్పందన తెలిపారు. ప్రధానంగా సిమెంట్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తే తాగునీటి ఎద్దడి తలెత్తి కాలుష్యం చోటుచేసుకుంటుందని కొందరు తమ అభిప్రాయాలు తెలపగా మరికొందరు తిరుత్తణి పరిసర ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలకు సిమెంట్‌ ఫ్యాక్టరీ ఎంతో ప్రయోజకరంగా వుంటుందని, ఉపాధి అవకాశాలు కోసం యువత ఎదురుచూస్తున్న క్రమంలో సిమెంట్‌ ప్యాక్టరీ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవశాలు ఏర్పడి ఎన్నో కుటుంబాలు బాగుపడుతాయని తమ స్పందన తెలిపారు. ప్రజల భిన్న అభిప్రాయాలను వీడియో ద్వారా రికార్డు చేసిన అధికారులు కలెక్టర్‌కు నివేదిక సమర్పించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement