తమిళసినిమా : గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం తర్వాత నటనకు చిన్న గ్యాప్ ఇచ్చిన నటుడు అజిత్ కుమార్ ఇప్పుడు మళ్లీ వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన కారు రేసుల్లో పాల్గొన్న సన్నివేశాలతో రూపొందిన గ్లాడియేటర్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. కాగా తాజాగా తన సతీమణి నటి శాలిని నిర్మాతగా అవతారమెత్తి నిర్మించనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచంద్రన్ కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కదా చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా తదుపరి వెంకట్ ప్రభు దర్శకత్వంలో అజిత్ కుమార్ నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు తెలిసింది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు మంగాత్తా వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది అన్నది గమనార్హం. ఇకపోతే ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాత నటుడు అజిత్ కుమార్ ఒక బ్రహ్మాండ భారీ పాన్ ఇండియా చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తాజా సమాచారం. దీనికి స్టార్ డైరెక్టర్ రాజమౌళి శిష్యుడు దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఆయన చెప్పిన కథ అజిత్ కుమార్‌కు నచ్చిందని, అందులో నటించడానికి ఆయన సమ్మతించినట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని తమిళం తెలుగు హిందీ కన్నడం మలయాళం, భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో బ్రహ్మాండంగా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోవడం గమనార్హం.


