తమిళసినిమా: బ్లాక్ అండ్ వైట్ మీడియా సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం చిట్టుకురింజి. ఈ చిత్రం ద్వారా వీజే.మీనాక్షి సుందరం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రజిత్ మీనన్ నాయకుడిగా నటించిన ఇందులో దీప్షిక, నక్షా చరణ్ నాయికలుగా నటించారు. శ్రీరామ్ కార్తీక్ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ ద్వారా మారా సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఫ్రాన్సిస్ రాజ్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా చిత్రంలోని చిక్కుకుపోయింది కుదిరింది మలై మేల అనే పల్లవితో సాగే పాటను ఇటీవల విడుదలై చేసినట్లు ఈ పాటుకు సంగీత ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటికే 15 లక్షల మంది చూశారని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. ఇది 1983 ప్రాంతంలో జరిగే ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫాంటసీ కథా చిత్రం ఇదని చెప్పారు. చిత్ర నేపథ్య సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు గాంచిన సంగీత ఆర్కెస్ట్రాతో హంగేరి దేశంలోని బుడాపెస్ట్ స్కోరింగ్ కంపెనీ స్టూడియోలో నిర్వహించినట్లు చెప్పారు.చిత్రం కోసం కొడైక్కానల్ కొండ ప్రాంతం కింది భాగంలో సుమారు 80 ఎకరాల్లో భారీ సెట్ వేసి ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర డబ్బింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం ఇతర నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ తదితర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ సభ్యులు తెలిపారు.


