స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పష్టత
సాక్షి, చైన్నె: శాసనసభలోకి సీఎం వచ్చినప్పుడు సభ్యులు గౌరవార్థం లేచి నిలబడటం తప్పనిసరా..? అనే అంశంపై అసెంబ్లీలో సోమవారం కాసేపు పెద్ద ఎత్తున చర్చ నడిచింది. దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ స్పందిస్తూ... సీఎం సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడటం నిర్బంధం ఏమీ కాదన్నారు. అది వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, సభ్యుల హక్కుకు సంబంధించిన అంశం అని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..
సభలో దేవాదాయ శాఖమంత్రి రమేష్ మాట్లాడుతూ, సీఎం విజయ్ సభలోకి వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించే మర్యాదను ప్రతిపక్ష నాయకుడికి , మాజీ సీఎం ఓ. పన్నీర్‌సెల్వం నేర్పించాల్సి ఉందని అసెంబ్లీలో ప్రస్తావించారు.ఇందుకు పన్నీరుసెల్వం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.పన్నీర్‌సెల్వం సమాధానం ఇస్తూ స్పీకర్ సభలోకి వచ్చినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరూ లేచి నిలబడటం కాలక్రమేణా వస్తున్న సాంప్రదాయం అని గుర్తు చేశారు. అయితే, సీఎం నేరుగా తమ స్థానానికి వెళ్లి నమస్కరించి కూర్చోవడం అనవాయితీగా వస్తున్నదన్నారు. తాజా సీఎం విజయ్ సభలోకి వస్తూ అటు... ఇటు ఇరువైపులా తిరిగి నమస్కరిస్తూ వెళ్తున్నారని, ఇది కొత్తగా ఉందన్నారు.. ఒకవేళ సీఎం కోసం లేచి నిలబడాలనే నిబంధనే ఉంటే, ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కూడా నిలబడాలా? అని ప్రశ్నించారు.
స్పీకర్ వివరణ..
దీనిపై స్పీకర్ జే.సి.డి. ప్రభాకర్ సమాధానమిస్తూ.. సీఎంగానీ, ప్రతి పక్ష నాయకుడు గానీ సభలోకి వచ్చినప్పుడు సభ్యులు లేచి నిలబడాలనే నిబంధన ఏమీ లేదన్నారు. ఈ సభ అత్యున్నత సాంప్రదాయం ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడమేనని పేర్కొన్నారు. తమిళుల సంస్కృతి ప్రకారం అలా గౌరవం ఇవ్వడం మంచి పరిణామమేనని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాలా వద్దా అనేది సభ్యుల ఇష్టానికే వదిలేస్తున్నానని వివరించారు.
100 రోజుల పాలనపై స్పీకర్ ప్రశంసలు
ముందుగా అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం విజయవంతంగా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్పీకర్ జేసీడీ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. లౌకిక, సామాజిక న్యాయాన్ని కాపాడే సీఎం విజయ్ పాలనలో ఈ 100 రోజులు కేవలం క్యాలెండర్ రోజులు కావు అని, తమిళనాడు చరిత్రలో ఒక చారిత్రక మార్పు అని వ్యాఖ్యలు చేశారు. వ


