వెట్రి ఇల్లత్తరసి వీట్టు తోట్టం పథకం | - | Sakshi
Sakshi News home page

వెట్రి ఇల్లత్తరసి వీట్టు తోట్టం పథకం

Aug 7 2026 1:56 AM | Updated on Aug 7 2026 1:56 AM

వ్యవసాయ బడ్జెట్‌లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులను ప్రోత్సహించేందుకు రూ.10 కోట్ల వ్యయంతో ‘వెట్రి ఇల్లత్తరసి వీట్టు తోట్టం పథకం’ తో పాటు తోటబడి, కొబ్బరి రైతులకు సంబంధించిన పలు కీలక కేటాయింపులను మంత్రి వినోద్‌ ప్రకటించారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల వద్ద పండ్లు, కూరగాయలు మరియు మూలికా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అలాగే పనై పాఠశాల , పనై పరిరక్షణ మిషన్‌ కు రూ. 2.10 కోట్లు కేటాయిస్తూ, తాటి చెట్ల పరిరక్షణ, తాటి ఉత్పత్తుల తయారీ విక్రయాలను ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్ట్‌ కొనసాగుతుంది. బ్రోకోలీ, క్యాబేజీ, ముల్లంగి, పచ్చి బటాణీ, శనగలు, అవిసె గింజలు, ఉల్లిపాయలు, పెసలు, ఉలువలు, నువ్వులు, గోధుమలతో కూడిన మైక్రోగ్రీన్స్‌ కిట్లను ప్రధాన నగర ప్రాంతాల్లో పంపిణీ చేసేందుకు నిధులు కేటాయించారు. తోటబడి పంటల అభివృద్ధికి రూ. 41 కోట్లు కేటాయిస్తూ, చామంతి సాగుకు 5 కోట్లు అందజేయనున్నారు. వాతావరణ మార్పుల సమయంలో చామంతి పూల మొక్కల ఎదుగుదలను వేగవంతం చేసేందుకు గాను రైతుల అభ్యర్థన మేరకు ఎల్‌ఈడీ దీపాల అమరిక పథకం ప్రారంభించనున్నారు.

గ్రీన్‌ హౌస్‌ – షేడ్‌ నెట్స్‌

రూ. 15.55 కోట్లుతో 3 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గ్రీన్‌హౌస్‌లు, షేడ్‌ నైట్స్‌ నిర్మాణం. పండ్ల రక్షణ లక్ష్యంగా 2.50 కోట్లుతో 2,500 ఎకరాల్లో సాగవుతున్న పండ్ల తోటలు, అరటి గెలల రక్షణకు ప్రత్యేక కవర్ల పంపిణీ చేయనున్నార. శాశ్వత పందెళ్ల నిర్మాణంకు రూ. రూ. 11.73 కోట్లు కేటాయించారు. దీని ద్వారా తీగజాతి తోటబడి పంటల కోసం శాశ్వత పందెళ్ల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వనున్నారు. అరటి తోటలకు ఊతకరల్ర సపోర్ట్‌కు రూ. 6.25 కోట్లు కేటాయిస్తూ, ఈదురు గాలుల నుండి అరటి చెట్లను కాపాడుకోవడానికి గాలివాటంగా కరల్ర మద్దతు ఇచ్చేందుకు రైతుల డిమాండ్‌ మేరకు నిధుల కేటాయించారు.

కొబ్బరి రైతుల కోసం ప్రత్యేక పథకాలు

రూ. 16 కోట్ల బడ్జెట్‌తో కొబ్బరి ప్రాజెక్టు అమలు కానున్నది. చెట్ల పోషణకు రూ. 6.20 కోట్లతో కొబ్బరి టానిక్‌ పంపిణీ. తెల్ల ఈగల దాడిని అరికట్టేందుకు 75% సబ్సిడీపై మైక్రోబయల్‌ మిశ్రమం పంపిణీ. ఇందు కోసం రూ. ఒక కోటి పంపిణి కొత్త కొబ్బరి నర్సరీకి రూ. 48 లక్షలు కేటాయిస్తూ, కరూర్‌ జిల్లా మొదలైపట్టి ప్రభుత్వ తోటబడి ఫారమ్‌లో 15 ఎకరాల్లో నూతన కొబ్బరి నర్సరీ ఏర్పాటు కానన్నది. తమిళనాడు కొబ్బరి ప్రాసెసింగ్‌ కార్పొరేషన్‌కు రూ. 22.30 కోట్లు కేటాయిస్తూ, కొబ్బరి ఉత్పత్తుల విలువ ఆధారిత పెంపు కోసం నూతన కార్పొరేషన్‌ స్థాపనకు చర్యలు తీసుకున్నారు. ఎండు కొబ్బరి (కొబ్బరిచిప్పల) మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ కొనుగోలు పథకం అమలు కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement