ముఖ్యమంత్రి విజయ్
సాక్షి,చైన్నె: తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 ఆర్థిక సంవత్సర సాధారణ బడ్జెట్ , వ్యవసాయ బడ్జెట్‌లపై ముఖ్యమంత్రి విజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి, రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి కొత్త నమ్మకాన్ని ఇచ్చేలా రూపొందించబడ్డాయని కొనియాడారు. ఈ మేరకు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటన విడుదల చేశారు.
మంత్రులకు అభినందనలు
అధికారంలోకి వచ్చిన కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రజలందరి ప్రశంసలు అందుకునేలా బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక శాఖ మంత్రి మరియ విల్సన్ కు, అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించిన వ్యవసాయ–రైతు సంక్షేమ శాఖ మంత్రి వినోద్ కు సీఎం తన హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
అన్ని వర్గాలకు కొత్త నమ్మకం:
ఈ సవరించిన ఆర్థిక బడ్జెట్ దీర్ఘదర్శిత్వంతో రూపొందించబడిందని, ఇది విద్యార్థులు, యువత, మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు, కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, పారిశ్రామికవేత్తలు మరియు ప్రభుత్వ ఉద్యోగులతో సహా సమాజంలోని అన్ని వర్గాల పురోగతికి కొత్త ఆశలను చిగురింపజేస్తుందని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఈ వ్యవసాయ బడ్జెట్ కేవలం పంటల సాగుకే కాకుండా, దానికి అనుబంధంగా ఉన్న పశుసంవర్ధక శాఖ, మత్స్య పరిశ్రమ, పాడి పరిశ్రమ, ఆహార ప్రాసెసింగ్ మరియు విలువ ఆధారిత పెంపు వంటి రంగాలను అభివ్ధృ చేసేలా అత్యంత ప్రతిభావంతంగా తీర్చిదిద్దబడిందని తెలిపారు. సంవృద్ధిగా తమిళనాడు నిర్మాణం దిశగా విజయనౌక ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.


