వేలూరు: ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పుస్తకాలు చదవే వారు తక్కువయ్యారని పుస్తకాలు చదవడం ద్వారా మేదాశక్తి పెరుగుతుందని రచయిత, కవి లక్ష్మీపతి అన్నారు. వేలూరు రీడర్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి వాలీ వర్ధంతిని పురస్కరించుకుని ప్రత్యేక చర్చా వేదిక కార్యక్రమం జరిగింది. ఇందుకు ప్రియా గ్రూప్‌కు చెందిన ప్రియా సురేష్ అధ్యక్షత వహించగా కవి లక్ష్మీపతి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కవి వాలి రాసిన పాటలలో కుటుంబ సంబంధాలను తెలిపే విధంగా సామాజిక స్పృహను ప్రతిబింబించే విధంగా ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో గత కవులు రాసిన పుస్తకాలను చదివే వారు తక్కువ కావడంతో కవులు, రచయితిలకు ప్రస్తుతం తగిన గుర్తింపు లేదన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ప్రతి ఒక్కటీ గూగుల్‌ను వెతుకుతున్నారే తప్పామేధాశక్తితో ఏదీ ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని కోరారు. అనంతరం ప్రత్యేక పుస్తకాన్ని అవిష్కరించారు. కార్యక్రమంలో పన్నీర్‌సెల్వం, శ్రీధర్, జయపాల్, షణ్మగడియార్ సంఘం కార్యదర్శి అశోకన్, వేలూరు అన్ని వ్యాపారుల సంఘం రీజినల్ అధ్యక్షులు జ్ఞానవేల్ పాల్గొన్నారు.


