చికెన్‌ తిని యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

చికెన్‌ తిని యువకుడి మృతి

Published Mon, May 20 2024 10:44 AM

28 year old man died in tamil nadu after eating chicken

తిరువళ్లూరు: వెయిట్‌ లిఫ్టింగ్‌పై ఆసక్తితో తరచూ చికెన్‌ తిన్న యువకుడు మృతిచెందాడు. తిరువళ్లూరు జిల్లా తొయుదావూర్‌ గ్రామానికి చెందిన తులక్కానం కుమారుడు విఘ్నేష్(28). ఇతను వెయిట్‌ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు.  శరీర ఆకృతిని పెంచడానికి కోడిగుడ్లు, కోడిమాంసం మాత్రమే గత ఆరు నెలల నుంచి తీసుకుంటున్నట్టు తెలిసింది.

 దీంతో గత 16న అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే బంధువులు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడ వైద్యం అందించారు. ఆరోగ్యం కొంత కుదుటపడడంతో శనివారం ఇంటికి వెళ్లాడు. అనంతరం సమీపంలోని చర్చికి వెళ్లి ప్రార్థన నిర్వహిస్తుండగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అరక్కోణంలోని సీఎంసీ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement