వైద్య రంగంలో సరికొత్త ఒరవడి | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలో సరికొత్త ఒరవడి

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

వైద్య రంగంలో సరికొత్త ఒరవడి ● గుజరాత్‌ నుంచి

● గుజరాత్‌ నుంచి

చైన్నె రోగికి రోబోటిక్‌ సర్జరీ

సాక్షి, చైన్నె: ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ , లాపరోస్కోపిక్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ జెమ్‌లో వైద్య చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించారు. 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగికి ప్రపథమంగా డ్యూయల్‌–కన్సోల్‌ లాంగ్‌–డిస్టెన్స్‌ రోబోటిక్‌ టెలిసర్జరీని విజయవంతంగా నిర్వహించారు. బుధవారం ఈ వైద్య విధానం గురించి ప్రధాన సర్జన్‌ డాక్టర్‌ పి. సెంథిల్‌నాథన్‌ మీడియాకు వివరించారు. సాధారణంగా టెలిసర్జరీలో ఒక డాక్టర్‌ మాత్రమే దూరంగా ఉండి ఆపరేషన్‌ చేస్తారని, అయితే, తాజా సర్జరీలో శ్రీడ్యూయల్‌–కన్సోల్ఙ్‌ వ్యవస్థను ఉపయోగించామన్నారు. గుజరాత్‌ (వాపి) నుంచి ప్రధాన సర్జన్‌ గా ఉన్న తాను ఆపరేషన్‌ నిర్వహించగా.. చైన్నెలో రోగి పక్కనే ఉన్న మరో సర్జన్‌ ఉంటూ ఏకకాలంలో రోబోటిక్‌ ద్వారా విజయవంతం చేశామన్నారు. ఇద్దరు సర్జన్లు 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, పక్కపక్కనే ఉండి ఆపరేషన్‌ చేస్తున్నంత వేగంగా (రియల్‌ టైమ్‌) సమన్వయం చేసుకోవడం ఈ సాంకేతికత ప్రత్యేకత అని వివరించారు. తీవ్రమైన వాంతులు మరియు గ్యాస్ట్రో–ఎసోఫాగియల్‌ రిఫ్లక్స్‌ డిసీజ్‌ తో బాధపడుతున్న 23 ఏళ్ల యువకుడికి ఈ శ్రీరోబోటిక్‌ ఫండోప్లికేషన్ఙ్‌ సర్జరీ చేశామన్నారు. ఈసందర్భంగా సెంథిల్‌ నాథన్‌ బృందాన్ని ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ సీ పళణి వేలు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement